142
శారదలేఖలు
పూజ్యునీయుడగు ప్రభువుగను, సతతస్మరణీయుడగు దైవముగను సంభావింపబడుచున్న శ్రీరామచంద్రుని గుణశీలములు నిందింపబడుటచేతను, భారతగాథ దూష్యమనుటచేతను, మనదేశమునం దిప్పు డమలునందున్న వైవాహికపద్ధతిచే మన స్త్రీలందఱు పరపురుషసంపర్కము చేయుచున్నవారే అనుట చేతను, నేను నీకు జబాబిచ్చు నవసరముగల్గినది. సోదరీ! నేను నీవంటి తత్వజ్ఞానము గలదానను గాకపోయినను నా సామాన్యబుద్ధికిఁదోచిన చందమున జబాబొసంగిన నా సాహసమునకు క్షమించి చదువగోరెదను.
ప్రపంచమునందలి ప్రతి మనుజుఁడును నేదియో మతమునకు జెందియుండుటయు, నా మతమునుగూర్చి తనకు తెలిసినను తెలియకపోయినను దానియం దభిమానగౌరవములు గలిగియుండుటయు లోకసాధారణము. అయితే మా మతగ్రంథమైన భగవద్గీతయందు మా కధికగౌరవమనిన యన్యమత గ్రంథములైన కొరాను, బైబిలులను నిరసించుటగాదు. ప్రతిమతమును సత్యధర్మాశ్రయమైయేయున్నది. నిజమైన హిందువులకు పరమతసహనము ఉత్తమలక్షణము. అట్టి వారికి ప్రతిమతమును పూజ్యమేయగును. మతమననేమి? స్వేచ్ఛాసహజమైన మానవుల వర్తనమును ఒకనీతికి ఒకధర్మమునకు ఒకసత్యమునకు ఒకసాంప్రదాయమునకు బద్దపఱచునదే మతము. విధినియమములులేని మత మెందును లేదు. ఏమతము నవలంబించినను నామతనియమములు మాన