Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/160

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

134

శారదలేఖలు

యామోదమును తెల్పెడి తీర్మానము. పూర్వాచారపరులకు హృదయశల్యమును, సంస్కర్తలకును, దేశహితైకాభిలాషులకును, స్త్రీజనాభ్యుదయ చింతనాపరులకును నానందకరమునునగు నా తీర్మానము నెగ్గినవెనుక ఖద్దరు, హిందీ, స్త్రీపునర్వివాహములు, స్త్రీ వారసత్వములు, గౌరుగారి వయోనిర్ణయశాసనము, సంపూర్ణ స్వాతంత్య్రము, అస్పృశ్యత యనెడి పెక్కు విషయములనుగూర్చి తీర్మానములు చేయబడెను. అగ్రజాతులను కంపితగాత్రులను గావించెడి అస్పృశ్యతా విషయిక తీర్మానము సభలో చర్చకువచ్చునప్పటికి సాయంత్ర మాఱుగంటలు దాటెను. “మాలవాండ్ల నేవిధముగా దరిజేర్చుకొందు మనువారి ఆలాపములును, ఇండ్లకు వెడలవలసినవారి సందడియు నేకమై సభలో కలకలము మెండయ్యెను. ఇదే సమయములో సభలో పాల్గొనుట కవకాశము చిక్కనివారి కసంతృప్తిమెండై యొకచోనలిగి కూర్చుండి వియ్యపురాలి సాధింపులు సాగించిరి. ఇట్టిస్థితిలో సభను సాంతముగా సాగించి ముగించుటకు సాధ్యముగాక మఱునాడు సభను మూడుగంటలకు వాయిదావేసి ముగించిరి.

మఱునాడు కొంచెమాలస్యముగా నేను సభ కేగియుండుటచే నేను వెళ్ళునప్పటికే సభ ప్రారంభమైయుండెను. గత దినపు మహిళాసభ తరువాయియెట్లు సమాప్తము చేయబడెనో నాకు తెలియదు. నేడు తీర్మానములు లేక యెవరికి వారు తమ యభిమాన విషయములను గూర్చి ప్రసంగింప నగునని