Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/154

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

128

శారదలేఖలు

లోపములేదు. కాని అది స్త్రీలయెడ వారికిగల యగౌరవ భావమునకు నిదర్శనము కాగలదు. మఱియు అవియేగాదు. విషయము చక్కగా గ్రహింపకయే చేసినవిమర్శనలం దింకను పెక్కులున్నవి. లేఖావిస్తరభీతిచే వానినెల్ల యిందు వివరింపక విడిచితిని. ఏమైన సరియే అర్థముచేసికొన సామర్థ్యమున్నప్పుడే చదువవలయును. వివరింపగల సామర్థ్యమున్నప్పుడే వ్రాయవలయును. ఈ రెండింటికిని చాలనివా రూరక అపార్థములను దీసి రచయితల నగౌరవపఱచెడి కటుపదములతో వ్రాయుటకంటె మిన్నకుండుట మేలు.

ఎవరెన్ని విధముల సమర్థించినను నాట్యకళ యభివృద్ధి జెందునేమోకాని గౌరవస్థానమునకు వచ్చుటమాత్ర మింతలో నయ్యెడిదికాదు. ఈకళకు గౌరవము ముందుకలిగినదిలేదు. ఇఁక ముందు కలుగబోయెడిది గూడ సందేహమే. శైలూష వృత్తిచే జీవించువారు పూర్వమన్ని కులముల వారిచేతను బహిష్కరింపఁబడియే యుండిరి. కులస్థులు వారితో సంబంధబాంధవ్యముల కొప్పకుండుటయేగాక వారితో పంక్తిభోజనముల కంగీకరింపఁకుండిరి. రాజదత్తాగ్రహారములు వారికి చెందకుండునట్లు రాజులు శాసనములు వ్రాసిరి. పగటివేషములు వేయునట్టియు, భాగవతము లాడునట్టియు, బ్రాహ్మణులకు మా యిండ్లలో విడిగా భోజనము పెట్టువారమని యిటీవల మా తల్లిగారు చెప్పినప్పుడు నాకెంతయో ఆశ్చర్యమయ్యెను. ఆధునికనాగరికతామహిమచే సాంఘికవ్యవస్థలు శిథిలమైన యిక్కా