126
శారదలేఖలు
లేవను వేదాంతుల నానుడిని యొకవిధముగా విమర్శకులు గూడ నాదర్శముగా గొనవలసియుండును. పుఱ్ఱె కొకబుద్ధి జిహ్వ కొకరుచి. ఒక అభిప్రాయము మనము సరికాదనినపుడు దానిని సరియనువారును కుప్పలుతిప్పలుగా నుండనేయుందురు. అయితే ప్రకృతిభేదమునుబట్టి ఆ అవునుకాదనుటలో నొకరి పదప్రయోగము కటువుగను నొకరి పదప్రయోగము మృదులముగను నుండును. అంతమాత్రమునకే మనము కించనొందవలసిన పనిలేదు. అహింసాసత్యములు మహాత్ముని ఆదర్శములు. ప్రాచ్యప్రతీచ్య సమ్మేళనము రవీంద్రుని లక్ష్యము. ఈ ఆదర్శముల నంగీకరించినవారు వారిని కొండంతగ పొగడుచుండ అంగీకరింపనివారు తీవ్రముగ తెగడుచుందురు. అయితే ఆ మహాపురుషులకు నిందాస్తుతులయెడ నొక్కటే అద్వైతము. తమ కర్తవ్యములను సాధించుకొనుటే వారి ఆశయము. మహాత్ముడు ఒకప్పు డేమెనెనో తెలియునా? “లోకములో ఒకే మానవు డున్నంతవఱకు నాసత్యసిద్ధాంతమును బోధింపుచునే యుందును. నాఖద్దరు మంత్రము నుపదేశింపుచునే యుందును” అని. ఖద్దరుద్యమము ఎంతెంతటి మహాపురుషుల నిశితవిమర్శనమునకు గుఱియైనది! అందులకని మహాత్ముఁడెన్నడైనను నిరుత్సాహము జెందెనా? తన సంకల్పము విడనాడెనా? అటులనే స్త్రీలనాటకరంగ ప్రవేశమునుగూర్చి యొకమాఱు దీర్ఘముగా యోచించి అనుచితమైనదని మనస్ఫూర్తిగా నిశ్చయించిన వెనుక పెద్దపెద్ద లెల్లరు దీనికనుకూలముగా నున్నారనియు, ప్రసిద్ధపత్రికాధిపతులెల్లరు దీనికి చేయూత నిచ్చుచున్నారనియు