Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/150

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

124

శారదలేఖలు

బ్రిటిషుకార్మిక రాజ్యాంగమున మంత్రియై ప్రభుపదమును బడసిన సిడ్నీవెబ్బు దొరగారి యిల్లాలైన సిడ్నీ వెబ్బుసతి నిరీహ సంస్తవనీయముగానున్నది. పెనిమిటి ప్రభువైనప్పు డామె ప్రభ్వి కావలెను గదా? కాని ఆమె యాపదముపై నేమాత్రము మోహముజూపక యిట్లనెనట -"ప్రజాహృదయమున మాప్రతిష్ఠ సిడ్నీ వెబ్బు అను నామముచేతనే ఆరూఢమై నెలకొన్నది. కావున కలకాలమువఱకు నేను ఆ నామముచేతనే వ్యవహరింపబడుటకు ప్రియముపడుదును.” కల్పలతా! ఆగష్టు మాసపు 'గృహలక్ష్మి'లో నే నీ వృత్తాంతమును జూచినప్పుడు పరమానందముజెంది నీ వ్యామోహత బాపుట కిది మంచి మందు అనుకొంటిని. సిడ్నీ వెబ్బుసతి నిర్లిప్తత మన ఆంధ్ర మహిళామణుల కాదర్శకమగు గాక!


భావపురి

ఇట్లు మిత్రురాలు,

సెప్టెంబరు 1929

శారద.