Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/15

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

v

చీరలోపడి, చిక్కములో పిట్టవలె గొట్టుకొనుచున్నది.' * * * 'మళయాళస్త్రీలు సాధారణముగా నగలు ధరింపరు. రంగువస్త్రములు కట్టరు. వారి కట్టుబట్ట యాఱుమూరలె * * కేరళ కాంతలు చక్కగ జారుముడివైచుకొందురు. * సహజ దంతధవళిమయు నధరరక్తిమయు కేరళవనితల వదనారవిందములకు చెలువుగూర్చుచుండును. * దక్షిణ హిందూస్త్రీలలో కేరళస్త్రీలే చక్కనివారు.'

ప్రకృతి సౌందర్యవర్ణనమందు శారద యసమానప్రజ్ఞ యని చెప్ప నొప్పును. 'అపుడు మధ్యాహ్నమై, సూర్యుఁడు తీక్ష్ణముగా నెండగాయుచున్నను, మాబాటల కిరుప్రక్కలనున్న యెడతెగని వృక్షపంక్తుల ఛాయలచే, మే మెండకన్నెఱుఁగని శుద్ధాంతజనముల భాతినైతిమి ! * * కల్పలతా ! ఆపడమటికనుమలభాగ్య మేమని చెప్పుదును? సమస్త పాదపములు, అఖిలలతావితానములు సర్వగుల్మములు, వానిసొత్తు. * కుంకుమరాసులు పోసిన ట్లొకచోటను, పసుపుకుప్పలుపోసిన ట్లొక చోటను, నీలాంబరముగప్పిన ట్లొకచోటను, వెల్లముసుఁగువేసిన ట్లొక చోటను, వివిధ వర్ణపర్ణ విరాజితమై, యాకనుమలయందలి వృక్షవల్లరులు సొంపునింపుచుండెను!'

కాంచీ మధురా రామేశ్వరాది పుణ్యక్షేత్రదర్శనముచేసి వచ్చిన శారదకు మంచిభక్తి చేకూరెనని మనము సంతసింపవచ్చును. కాని యందందు కానవచ్చిన పీడలు నక్రమముల నామె మనస్సునఁ గొంత కలవరము నసహ్యతయును బుట్టించెను. గుళ్లలోని యర్చకుల చర్యలు పొడ గాంచిన శారద, 'సంపత్తిగలవారికే స్వామిదర్శనముగదా !' యని యాశ్చర్యపడెను.' ‘ఈవిధమున దేవతలు నేడు దౌర్జన్యపరులగు మానవుల చేతిలోఁజిక్కి, భక్తజనసులభులు గాకున్నారు!' అని యామె, వెతనందెను. ఐనను, ఆమె యాస్తిక్యబుద్ధిని దృఢపఱుచు ననుభవములును లేక