Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

121

లనన్యములు. సర్వతోముఖముగా ఆంధ్రప్రపంచమునకు వారు చేయుచున్న యుపకృతి పారములేనిది. అట్టివారిని బిరుదులు లేకనే ఆంధ్రప్రపంచము గుర్తించుచున్నది; పూజించుచున్నది; గౌరవించుచున్నది. ఇట్లు మునుపే ప్రజల మన్ననల చూరగొన్న యా మహనీయునకు మహాసభ “దేశోద్ధారక” బిరుద మొసంగుట సూర్యునకు దివిటీదానము చేసినట్లున్నది. ఇందువలన పంతులుగారికి ఇనుమడించెడి గౌరవములేదు. చేకూరెడి లాభములేదు. కాని అసాధారణమగు వారి దాతృత్వమునకు మహాసభవా రొకకొలమాన మేర్పరచినట్లైనది. సర్వతోముఖమగు వారి కృషి కొకముఖ మేర్పరచినట్లైనది. అపరిమితమగు వారి దేశసేవకు పరిమితి నేర్పఱచినట్లైనది. అంతియ దాని లాభము.

ఈ యే డాంధ్రమహాసభవారు నల్వురకు బిరుదము లొసంగిరి. వారు నల్వురును ఉత్తమోత్తమములైన యా సామర్థ్యచిహ్నములు పడయదగిన మహాపురుషులే యనుటకు సందియములేదు. కాని ఆ బిరుదులందుటవలన నా మహనీయులకు ప్రయోజనము లేకపోగా ఆంధ్రమహాసభవా రీ బిరుదులొసంగు పద్ధతిని గమనించి మన దేశమునందు కుప్పలు తిప్పలుగా జరుగుచుండెడి కులసభలును తదితర క్షుద్రసభలును చెలరేగి సాధారణులకెల్ల తలయొక బిరుదును నొసంగి ఈ మహనీయుల గొప్పతనమును క్రిందుపఱచునేమోనని భయ