120
శారదలేఖలు
ములేయైనను వీని ఆధిక్యతయేమో నాకు గోచరించుటలేదు. మహాకవియైన రవీంద్రనాథటాగోరుగారికి సర్ బిరుద మీయబడినప్పు డా మహాపురుషు డనెనట. ఏమని? "సర్ రవీంద్రనాథటాగోరు అనుటకంటె నా దేశీయులు 'రవిబాబు' అనుటయే నా కెక్కువ ప్రీతికరము” అని. కాన మహనీయులగు వారికి వారి నామాక్షరములే వేయి బిరుదులపెట్టు. ఎంత గొప్ప బిరుదమైన, వారి నామాక్షరములతో జేరినప్పుడే గదా రాణించును? అయినను స్త్రీలకుగాని పురుషులకుగాని యీ బిరుదులవలన గలుగబోయెడి ప్రయోజనమేమి? మునుపే గౌరవనీయులగువారి కీ బిరుదములవలన గౌరవ మినుమడింప బోదు. గౌరవహీనులగువారి కీ బిరుదులవలన గౌరవము కలుగను కలుగదు. మన ఆంధ్రమహాసభవారు గౌరవనీయులగువారి కీ గౌరవబిరుదములీయు టారంభించినది కీ॥ శే॥ దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారికి ఆంధ్రరత్న బిరుద మొసంగుటతో నని జ్ఞాపకము. నాటినుండి యేటేట నొకరికో యిద్దరికో యీ బిరుదములు చదివించుచునేయున్నారు. అన్నిటి కేమిగాని శ్రీ కాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారికి దేశోద్ధారక బిరుద మీయబడినదని పత్రికలలో చదివినప్పుడు నిజముగా నాకు నవ్వే వచ్చినది. పత్రికల మూలకముగా, ఉపన్యాసముల మూలకముగా, వితరణలమూలకముగా శ్రీపంతులుగారు దేశమునకు చేయుచున్న సేవ అమూల్యము. వారి సేవానిరతి అసదృశము: వారి దేశభక్తి యనుపమానము: వారి దానశీలత యసామాన్యము: వారి సౌజన్యకారుణ్యాదు