Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/14

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

iv

శారదతీవ్రతర్కమునకు లొంగని ప్రతిస్పర్థులవాదమును బూర్తిగ ఖండింపఁగల చమత్కృతి యామె పరిహాసమునకుఁగలదు! 'ఆపద్ధర్మముగా ఈ సంస్కారమునకు (అతిబాల్య వివాహములకు) శాస్త్రమొప్పినదట! పాపము, మనశాస్త్రములు చాలమంచివి. ఎవరి కేవీలుకావలెనో దాని కనుగుణ్యమగు నుదాహరణ శ్లోకమునుజూపి పూర్వాచారపరాయణులను రక్షించును. ఆకల్పవృక్షముప్రాపున వారుచేయని సాహసములేదు. పసిబాలలకు పరిణయము చేసిరి. కసుగందులను గూర్చుండబెట్టి గర్భాధాన మంత్రములు వల్లెవేయించిరి! * * రాళ్లు దేవుళ్లయిన రాసులు మ్రింగవా యని వేమన యోగీంద్రుడు సందేహించినట్టుగానే, యీశిశువివాహములలో దేవుళ్లు రాళ్ళయినారు. లేకున్న, ఆయాస్వాములసన్ని ధానమున తలిదండ్రు లిట్టి యక్రమవివాహములు జరుపఁగలిగియుందురా?'మగడు చావగనే మగువవాంఛ లేవిధముగా నడుగంటిపోవునో, మగువచావగనే మగవానికోరిక లావిధముగా నీరికలెత్తుచుండును. భర్తృవిహీన పసిదే యగుగాక యామె వాంఛ లడవిపువ్వులవలె నిరుపయోగముగ రాలిపోవలెను. * * ఆపసిదానిమోమున భస్మ రేఖలును, ఈముసలివాని మోమున చాదుచుక్కయునా!'

మనుజులవర్ణనమునందు - ముఖ్యముగ స్త్రీస్వభావమును చిత్రించుట యందు - శారదకరము ప్రకృతి కద్దముచూపించుచుండును. 'శారద పెండ్లిండ్ల' సందర్భమున కొన్నియేండ్లక్రిందట దేశమున పెండ్లిండ్లమీఁద పెండ్లిండ్లు జరిగెనుకదా. ఒక యూరేగింపులో 'పెండ్లికూతురు మూడేండ్లు నిండియు నిండని పసికూన, కట్టుకొనిన క్రొత్తపరికిణి యెత్తియెత్తి దులుపు కొనుచును, తొడుగుకొనిన పట్టుచొక్కాను పట్టి పట్టి చూచుకొనుచును, బొమ్మల పెండ్లిండ్లలోని బొమ్మవలె కూర్చున్నది. పెండ్లికొడుకో పదేండ్లవాడు, నిద్రచే తూగుచున్నాడు.' ఇంకొక యూరేగింపులో, 'పిల్లకొక పెద్దచీర చుట్టపెట్టి, పొదలకమ్మవలె కూర్చుండబెట్టినారు. ఆబాలిక యా