108
శారదలేఖలు
ప్రాచ్యమారుతమే యని కొందఱనుచున్నారు. ఇది యేగాలియైననేమి మనహిందూస్త్రీ మనస్తత్వముల కిదిసరిపడునా లేదా? యనునదియే యోచింపవలసిన యంశము. వేశ్యాజాతి స్వర్గలోకములోనున్నది. మర్త్యలోకములో నున్నది. పాతాళలోకములోనున్నది. చతుర్యుగములకు సంబంధించిన శ్రుతి స్మృతిపురాణేతిహాసములలో వీరి ప్రస్తావనగలదు. కాన నిది అతిపురాతనమైన తూర్పు వాయువు అని చెప్పుటకు సందేహములేదు. అయిన నేమి? నీతిభ్రష్టమైన యీజాతిధర్మమును కూకటివేళ్ళతో గూడ పెల్లగించుటకు దేశహితైకాభిలాషులెల్లరు తీవ్రముగా యత్నింపుచున్నారుగదా. అట్లె ఈ నాటకరంగ ప్రవేశోద్యమముగూడ ప్రాచ్యమైననేమి, ప్రతీచ్యమైననేమి, ప్రాక్తనమైననేమి అధునాతనమైననేమి? సతీశ్రేయమునకు భంగకరమైనచో నది నిర్మూలింపఁజేయుట స్త్రీల కర్తవ్యము. మనయింటిదీపమని ముద్దుపెట్టుకొననగునా?
కల్పలతా,
"లోకోభిన్నరుచి” యన్నట్లు జనులతలపులు బహువిధములు. నీతిలక్ష్యము కొందరికి, కళాప్రియత్వము కొందఱికి, కనులపండువు కొందఱికి, ఎవరి యుద్దేశము కాదనినను వారి కావేశమే యెత్తుకొనివచ్చును, కాని ఆలోచింపవలసిన విషయముల కావేశముచెందిన లాభములేదు. కాన ఒకప్పుడు శీలమునకై యాత్మార్పణము గావించి యశోవిశాల