Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/133

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

107

చెఱచినవి. నాటకములు శ్రీమంతులగు నాగరికుల కానందమును గూర్పవచ్చును, కాని ప్రజాసామాన్యమునకు వీని ప్రయోజనములేదు. ఒకవేళ యేపాటకపు జనుఁడైనను పావలా, అర్థా, చెల్లించి నాటకమునకు వెళ్ళి యుండినచో త్రాగుబోతైనవాడు; యింటిలోనిభార్యాబిడ్డలగోడు జూడక కల్లంగడికి వెళ్లినట్లే నాటకముల చూడవచ్చిన కూలివాడు కూడ ఇంటిలో మఱుపూట గంజి కాధారములేకుండజేసి నాటకసందర్శనమనెడి దుర్వ్యసనపిసాస దీర్చుకొనుటకు వచ్చి యుండెననుట స్పష్టము. కాన ధనికులకే నాటకములు. వీరి యానందమునకు పురుషవేషధారులు చాలలేదు. కాన స్త్రీలనుగూడ రమ్మనుచున్నారు.

ఇటీవల కొంతకాలమునుండియు నాటకకళ విషయమై మనయాంధ్రదేశమునందు ప్రచారము జరుగుచున్నది. సమర్థులైన నటకులు కొందఱు బయలుదేరి బహుమానములు, బిరుదులు, పొందుచున్నారు. ఈకళాభివృద్ధికై గ్రంథములు కొన్ని ప్రకటింపఁబడినవి. పత్రికలుగూడ స్థాపింపఁబడినట్లు జ్ఞాపకము. కాని ఈప్రచారమంతయు పురుషులలోనే జరుగుచున్నది. స్త్రీలుగూడ నాటకరంగములో పాల్గొనకుండుట లోపమను సంగతిని కళావిదులు నిన్నమొన్నటివఱకు గుర్తింప లేదు. బహశఃయిది ఈవత్సరమే దేశములో ప్రవేశించిన నవ్య మారుతము. ఇది పశ్చిమవాయువని కొందరన కాదు, కాదిది