106
శారదలేఖలు
అన్నిజాతులవారును పాల్గొనిరి. బ్రాహ్మణభాగవతులు-వీరే కూచిపూడిభాగవతులు. గొల్లభాగవతులు, ఏనాదిభాగవతులు, మాలభాగవతులను పేరులతో వేర్వేఱు కులములవారు భాగవతముల నాడుచుండుట యిప్పటికిని కందుము. నాట్యకళా బ్రహ్మయగు భరతాచార్యునకు పూజ్యత ఈ భాగవతముల యందే కల్గినది. మఱియు హావభావముల కాధిక్యతయు, శృంగారమునకు ప్రాముఖ్యతయు, కృష్ణచారిత్రమునకు ప్రాధాన్యతయు, నీతికి న్యూనతయు నీభాగవతముల కాలముననే గల్గెను. కాని యొకమేలు, వీధిభాగవతముల వఱకు వీని వ్యయము జనసామాన్యమునకు తగిలెడిదికాదు. గ్రామములో పెద్దలైనవా రేనలుగురైదుగురో దానివ్యయమును భరించి ప్రజాసామాన్యమున కాయాటను సందర్శించుభాగ్యమును ధారాగతము చేసిడివారు. వాని తరువాతివే నాటకములు. ఈనాటకములలో గూడ వీధినాటకములని యొక్కటే తెఱతో వీధులలోనాడునవి కలవు కానివాని ప్రచారము స్వల్పము. ఇప్పటి నాటకములనగా వానికొక ప్రత్యేకమందిరముండును. రంగాను కూలములైన పరికరము లధికము. నేపథ్యాడంబర మెక్కువ. నృత్యగీతాభినయములకు ప్రాముఖ్యత యధికము. మఱియు ప్రతిచూపరియు కొంతమూల్యమును తన స్థితినిబట్టి యిచ్చు కొనవలయుట వీనిలో ముఖ్యవిషయము. టిక్కెట్లపద్ధతితో గూడిన నాటకములు ధనికులను పేదలను విడదీసినవి. కాన భాగవతములు నాటకములు మున్నగు కాలక్షేపములు జరుపుట ప్రజాప్రబోధమునకనెడి యాదర్శమును నాటకములు