Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/131

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

105

వాయిద్యపరికరములుగూడ నధికమైనవి. గాత్రమాధుర్యమునకు ప్రాముఖ్యత ఈయబడినది. కాన కథలకు కళాసాంకర్యము గల్గినది, ఈతోలుబొమ్మలాటలయందేనని చెప్పవచ్చును. కాని మన భరతఖండమునందలి ప్రసిద్ధేతిహాసములగు రామాయణ భారతాది యుద్గ్రంథములయందలి శూరభక్తానీకముల చరిత్రములను బొమ్మలద్వారాసుబోధముగావించి పామరజనులలో నీతిప్రబోధము గావించుటయే యీతోలుబొమ్మలాటల లక్ష్యముగూడ నై యుండెను. కాని యచేతనములగు తోలుబొమ్మల నాడించి సచేతనపు తోలుబొమ్మలగు జనసామాన్యము నానందింపజేయుట యనునది కాలక్రమమున నాగరికులకు మోటుగా తోచినది. కాన తామే ఆయాపాత్రములు ధరించి నటించుట యుక్తముగా భావించినారు. అవియే భాగవతములు. తోలుబొమ్మలాటవఱకు మనుజుఁడు మొగమునకు రంగుపూసికొని రంగమున కెక్కలేదు. మఱియు తోలుబొమ్మలాటవఱకు నీకథల నడుపువారు సామాన్యముగా శూద్రులే యైయుండిరి. ప్రాయికముగా వీరి గురువులు బ్రాహ్మణులై యుండినను నలువురిలో నాడెడివారు మాత్రము బ్రాహ్మణేతరులే. బ్రాహ్మణేతరులలో నిట్టియాటపాటల కాలక్షేపములు జరుగుచుండ బ్రాహ్మణు లూరుకొనలేదు. పురాణపఠనము హరికథలు మున్నగునవి వారి కాలక్షేపములుగా నుండెడివి. అయితే వారి కాలక్షేపములకు వీరును వీరికాలక్షేపములకు వారును పోకుండిరని భావనకాదు. వాని ఆధిపత్యము లాయాజాతులవారు మాత్రమే చేయుచుండిరని యర్థము. అయితే భాగవతములలో