104
శారదలేఖలు
పదులు. ఈ పదములు వట్టి పొడిమాటలు కాకపోయినను తత్తుల్యములగు కొంచెము రాగముతోగూడిన పదములు. వీనికి కొంచెమూత ఏకతంత్రీసాధనమగు తంబూరయు కొమ్ము, తిత్తి, మున్నగునవియు. పూర్వము జనసామాన్యములో మతము, యుద్ధము, మున్నగు వానినిగూర్చి ప్రబోధము కలిగించ వలసినప్పుడు పరవశచిత్తులగు వారిచే నుద్రేకముగా చదువబడెడి యీ పదములు బహూపయోగకరముగ నుండెడివి. ఇప్పటికిని బొబ్బిలికధ, పల్నాటి వీరచరిత్రము, మున్నగు వీరచరితములు పాడబడునపుడు జానపదులలో గల్గెడి యుత్సాహ మద్భుతము. వీనికి పై మెట్టు తోలుబొమ్మలాటలు. జనులలో నాగరికత యభివృద్ధియైన కొలది యీకాలక్షేపముల యభివృద్ధియు పలు తెఱగులుగా నుండజొచ్చినది. ఉపనిషత్కాలమున మానసికముగానున్న యేకేశ్వరోపాసన, కాలక్రమమున ఆడంబరములతోగూడిన ప్రతిమార్చనగా మాఱి మనుజుని పతనమునకు కారణమైనట్లు ఈకాలక్షేపముల వృద్ధియు మన పతనమునకే దారిచూపినది. కథలను గేయములను వినునప్పు డాయాకధలలోని యుత్తమపాత్రలకు మానసికముగా రూపకల్పన గావించుకొని వాని సత్యశీలసామర్థ్యములను గుర్తించి వానిని తమ జీవితములం దనుష్ఠేయముగా నుంచుకొనుటకు శ్రోతల కవకాశ ముండెడిది. కాని తోలుబొమ్మలాటలలో ప్రసిద్ధవ్యక్తులకు కృత్రిమరూపములు కల్పించుటచే చిత్తైకాగ్రత నశించినది. తోలుబొమ్మలాటతోనే రంగస్థలమున తెఱయెత్తబడినది.