102
శారదలేఖలు
చెఱచినయెడల స్త్రీ రంగమునకెక్కిన ప్రయోజనమేమి? నవరసముల పోషించి హావభావప్రకటనమునందు లోటులేకుండ ప్రదర్శించి నాటకములలో స్త్రీ ప్రవేశింప కుండుటవలన గలిగెడి గొప్పలోటును తొలగించి నాటకకళను మహోన్నతస్థితికి దెచ్చుటకే గదా స్త్రీ, నటకురాలు కావలసివచ్చినది? కాన స్త్రీ, రంగమున కెక్కినతరువాత, మడిలేని పిన్న పెద్దలు సంచరించెడిచోట మడిగట్టుకొనిన ముసలమ్మ యొదిగియొదిగి నడచినట్లు, ఎడ యెడగానుండుటకు వలనుపడదు. కలిసి చరించుట స్త్రీలకర్హము గాదు. అయినను నాటకకళాభివృద్ధికొఱకు స్త్రీల నేల బలవంతముగా నాకర్షింపవలెనో నాకు తోచకున్నది. రాముడుగాని తా నచ్చముగ రాముడుగను, సీతగానితా నచ్చముగ సీతగను, నటించి వేషధారి ప్రేక్షకుల నానందింపజేయుటయే నాటకము. తాము సీతారాములముగామని నటకులకు దెలియును, ప్రేక్షకులకును దెలియును. అట్టిచో సీతవేషమును స్త్రీవేసినను నొకటే పురుషుడు వేసినను నొకటే. పురుషుఁడు స్త్రీగా నటించిన నందు కొంత సామర్థ్యప్రకటన ముండునేమోగాని నటించినచో నందద్భుత మేముండును? స్త్రీయైన మాత్రమున పలుభావములు ప్రకటించుటలో కౌశలము వలదా? యనిన నదియు నిజమేకాని పురుషుఁడే యిన్నిభావములు ప్రదర్శించిన మఱియు నధికకుశలతయనిపించు కొనునుగదా! శీలము మనుష్యునిబట్టి యుండును గాని వృత్తినిబట్టియుండదని కొందఱనుచున్నారు. కాని సీతవంటి శీలవతి నాటకరంగములో సీతవేషమును ధరించు ననుకొనుము. ఆదర్శపాత్రమగు సీతశీలమును ప్రతిస్త్రీయును తన