96
శారదలేఖలు
వారున్నారు. వారు బస్సుఅధికారులకు గురుదేవులు. వారు ఎక్కడ ఏసమయములో ఎంతయిరుకులో ఎక్కెదమనినను చప్పున బస్సు ఆపి యెక్కించుకొనవలసినదే. ఇక మోటారు బండ్లవారి కేమిభయము? పోలీసువారి కొక్కరికి విధేయతజూపి తమవారినిగా జేసికొనినచో ఇఁక నెందరియెడ అవిధేయత జూపినను భయములేదుగదా!
తిరునల్వేలి తామ్రపర్ణీతీరము. ఆ నదీస్నానార్థమే మే మచ్చట కేగితిమి. అచ్చటి సత్రము అసహ్యముగా నున్నది. ఎట్లెట్లో ముక్కుమూసికొని ఆరాత్రి అచ్చట నిలిచితిమి. తెల్లవారి తామ్రపర్ణిలో స్నానముచేసి వచ్చి భోజనాదులుగావించుకొంటిమీ. అనంతర మొకజట్కాబండి కుదుర్చుకొని ఊరిలోని దేవాలయములను విపణివీధులను చూడనేగితిమి. తిరునల్వేలిలోని శివాలయము చాలగొప్పదే. కాని అచ్చటి శిల్పములు మాత్రము చూడదగినవికావు. ఇన్ని ప్రసిద్ధదేవాలయములను గాంచితిమి కాని ఆతిరునల్వేలిపట్టణములోని దేవాలయములో గల యవినీతికరమగు బొమ్మలు మాత్రము మఱెచ్చటనులేవు. ఆసాయంత్రమే బయలుదేరి మధురకు వెళ్లితిమి. అచట నొకదినముండి యటనుండి శ్రీరంగక్షేత్రమున కేగితిమి. తిరుచునాపల్లినుండియే మాకు వైష్ణవులు తరుచుగా గనుపింపజొచ్చిరి. ఇఁక శ్రీరంగమున కేగ నెచటజూచిననువారే. రంగని ఆలయము సప్తప్రాకార విరాజితమే గాని యింపుసొంపులేదు. శిల్పము గూడ స్వల్పమే.