ii
దేవి యుపన్యాసమును, కన్నప్పకథయు, గౌరవబిరుదములవలెనే శారదా శాసన చర్చయు స్త్రీల నాటకరంగప్రవేశమును, శారదకు లేఖావిషయ లగుచున్నవి ! పుస్తకరచనమున ప్రాఁతదారి త్రొక్కి పురుషుల యభిప్రాయములె చిలుక పలుకులవలె శారద, యేకరువు పెట్టునదికాదు. స్త్రీజన సహజమగు సదయహృదయత, స్వభావసారళ్యమును, పుస్తకమందలి ప్రతిపుటయందును ప్రతిబింబితమగుచున్నవి. ఆంధ్రవాఙ్మయమున నీపుస్తకమునకు గౌరవస్థాన మొనఁగూర్చుట కిది యొకటియె చాలును. పరదేశ మందున్నను, రెయిలుపయనము చేయుచున్నను, పుణ్యతీర్థసందర్శనమందున్నను స్త్రీలసభలోఁ బాల్గొనుచున్నను, శారద యూహలు, పలుకులు హిందూయువిదవియె ! భావముననెగాక భాషయందును ఈ లేఖావళియందెల్లెడలను స్త్రీస్వభావము చిప్పిలుచున్నది! 'ఊరుగాయజాడీలకు పచ్చడి బానలకు మాత్రమె రెయిలులో నొక పెట్టెయు, ఇంటియం దొకగదియు మనకుఁ గావలయును! ఈ మధ్య మన ప్రాంతములనుండి యొక రీ గ్రామమున కుద్యోగసందర్భమున నేతెంచిరి. వారి సామాను నాలుగైదు బండ్లు నిండియుండెను. ఐదారు మంచములుగూడ తెచ్చిరి. ఈ ప్రాంతమున మంచములు వాడుకొను అభ్యాసములేదు!' అని శారద, తన తెలుఁగు చెలికత్తెలను మెత్తని యెత్తిపొడుపుమాట లనుచున్నది! కాళహస్తిలో దొరకు కొయ్యదువ్వెనలు నల్ల గాజులును శారదకు మిగుల ప్రియము. ఈ దువ్వెనలను నిరాకరించి, విదేశపు మెఱుఁగు దువ్వెనల కెగఁబడు తెలుగుమగువలమీఁద, స్వదేశవన్తుప్రియయగు శారద, కోపానల మిట్లు కురియుచున్నది 'మెఱుఁగే మన కనులలో కంపకొట్టుచున్నది. దువ్వెనలకు మెఱుఁగు, గాజులకు మెఱుఁగు, గుడ్డలకు మెఱుఁగు, మొగములకు మెఱుఁగు! ఈ విదేశపు మెఱుఁగులు మన మెఱుఁగును రూపుమాపు చున్నవి!' 'సిగనిండ పువ్వులు దుఱుముకొని, యొడలినిండ నగలుపెట్టుకొని, వన్నెవన్నెల విలువ చీరలు ధరించి, ప్రతి చిన్నహరికథకును తండోపతండములుగ వచ్చెడి బెజవాడపుర వనితలు' ఇటీవల నచట జరిగిన ఆంధ్ర