Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/115

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శారదలేఖలు

89

యు వెలిగింతురట. ఆసమయమున దేవాలయావరణ మంతయు దేదీప్యమానములగు దీపమాలికలతోనొప్పి యపరనక్షత్ర మండలమువలెవిరాజిల్లునట. దురదృష్టవశమున నాకానాడాదీపోత్సవమునుచూచుట సంభవింపలేదు. కాని మావాళ్లందఱు చూచివచ్చిరి. ఆ దేవాలయమునందు మఱియొక యెంచదగిన విశేషమేమన ఆ ఆలయమందేగల స్వామివారి యన్న సత్రములో నిరతాన్నదానము జరుగుచుండును. ఎన్నిమాఱులు తినినను ఎన్ని దినములున్నను నదియేమని యడుగువారులేరు. కాన పెక్కుమంది బ్రాహ్మణబాలు రాయన్నసత్రములో భుజించి చదువుకొనుచుందురట. అచ్చటవండెడి అన్నమంతయు స్వామికి నివేదనచేసి ప్రజలకు పెట్టుచుందురు. అయితే ఆ భోజనము మనము చేయలేము. చారునీళ్లు, జారుపప్పు, మెత్తని అన్నము, నేయి, పూజ్యమైన ఆభోజనమును దాక్షిణాత్యులేగాని మన తెలుగువారు తినజాలరు. నేయి, పచ్చడులు లేని భోజన మాంధ్రులకు పస్తుతో తుల్యముగదా!

మఱియొక విశేషమేమన తిరువాన్కూరు రాజ్యమునకు పద్మనాభస్వామివారే ప్రభువు. కావుననే నాణెములపై స్వామి చిహ్నములగు శంఖచక్రములు ముద్రింపబడి యుండును. పద్మనాభస్వామి తిరువాన్కూరు సంస్థానమునకు ప్రభువైన కారణమేమన, ఒకమారు తిరువాన్కూరు రాజ్యము అప్పుల పాలయ్యెనట. ఆఋణమునుండి విముక్తిగాంచుటకు ప్రభువునొద్ద ధనములేకపోయెను. పద్మనాభస్వామికి చాలసొత్తుగలదు. ఆ