88
శారదలేఖలు
వెంటనే స్వామిదర్శనమునకేగితిమి. ఆనాడు మకరసంక్రాంతి. దేవాలయములో గొప్పయుత్సవము. కాన నితరగ్రామముల నుండి చాలమంది యాత్రికులు వచ్చియుండిరి. కాన స్వామిదర్శనము కాదనియే యనుకొంటిని. కాని యచ్చట నొకమేలు గలదు. వచ్చినజనులందఱిని నొక్కమాఱుగా నాలయములోనికి విడువరు. స్వామిదర్శనముచేయించుట కాలయములో నొకదుబాసియుండెను. ఆయన యేదేశమువారితో నా దేశపు భాషాడి స్వామిదర్శనము చేయించును. ఆ దుబాసి నాయముతోనే మేము స్వామిదర్శనము చేసితిమి. అనంతపద్మనాభస్వామి కడుపెద్దస్వామి. శ్రీరంగములోని రంగనాయకులవలె అనంత పద్మనాభస్వామిగూడ శయనించియుండును. కాని రంగశాయికంటె అనంతుడు రెట్టింపుండును. గర్భాలయమునకు తలయొద్ద నొకటియు, నాభియొద్దనొకటియు, పాదములయొద్ద నొకటియు మూడుద్వారములుగలవు. ఈమూడు ద్వారములలో దర్శించినగాని స్వామివారి సంపూర్ణాకృతి యగుపించదు. పద్మనాభాలయము చాల గొప్పది. కాని యెంచదగిన శిల్పకళలేదు. దేవాలయముచుట్టును దీపములుంచుటకు దగిన ప్రమిదలతో కొయ్యలమర్పబడియున్నవి. అవి లక్షదీపములట. అఱుమాసములకొకమాఱు లక్షదీపములు వెలిగింతురట. దానినే దీపోత్సవ మందురు. మేమువెళ్ళిననాడు (సంక్రాంతి) దీపోత్సవమే. దానిని చూచుటకే యాత్రికులధికముగా వచ్చియుండిరి. ఆకాశదీపమనెడి యెత్తైనదీపమును వెలిగించినవెనుక తక్కిన దీపములన్ని