శారదలేఖలు
77
జలధార యాలేయెండ ప్రసారముచే పసిమిజెంది బంగారునీరును గ్రుమ్మరించుచున్నట్లుండెను. అప్పటి యాప్రదేశపు సౌందర్యము వర్ణనాతీతము.
ఆజలధారయందు స్నానముచేయుటకు మొదట మాకు చాలభయముగొల్పెను. కాని స్నానార్థ మేగినవారమెంతసేపా వేడుక నరయుచు నిలువబడుదుము? స్నానము చేయువారు జారిపడకుండ పట్టుకొనుటకై యక్కడ నినుపకడ్డీలుగూడ నున్నవి. ఆకడ్డీలను పట్టుకొనియు మేము ఆజలధారయొక్క చిందులకే జడిసితిమి కొంతసేపు. చిన్నధారల కడలితిమి కొంతసేపు. ఇటుల క్రమక్రమముగా సమీపించి ఆపెద్దధారపాటుకు వెఱచి మొదట నడుమిచ్చితిమి, తదుపరి తలయొగ్గితిమి. ఆనీటి మోదులకు మొదట నాగజాలక పోతిమి. తరువాత విడువజాలక పోతిమి. ఆరంభమున నచ్చట స్నానముచేయుటకెంత భయముగొల్పెనో అంత్యమున దానిని విడిచివచ్చుట కంత విచారము గొల్పెను. ఆజలధారయొక్కనీరే పెక్కు పాయలుగా చీలి యూరినంతను చుట్టి పాఱుచున్నది. స్వాములవారి మఠము చుట్టును ప్రవహింపుచున్నదిగూడ నదియే. చల్లదనమునకును మాధుర్యమునకును నాజలము సాటిలేనిదని చెప్పనగును. ఆ జలధారకు సమీపముననే కుర్తాళేశ్వరుని ఆలయమున్నది. ఆ యాలయములోనికిపోయి స్వామినిసేవించి మాబసకువచ్చి వెంటనే వంటజేసికొని భోజనాదులు గావించుకొని జనార్దనమను పుణ్య క్షేత్రమున కేగుటకై రైల్వేస్టేషనుకు వచ్చితిమి. సరిగా పది