Jump to content

పుట:Sarada Lekhalu Vol 1.pdf/102

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

76

శారదలేఖలు

గన్పట్టును. పరివ్రాజక సామాన్యమగు సాత్వికతకంటె రాజసమే యచ్చట హెచ్చుగా గనుపించును. ఆమఠములోని యొకానొక గృహమునందు మేము విడిసి వంటజేసికొని భుజించితిమి.

మఱునాడు ప్రాతఃకాలముననే లేచి హరిభి యను జలధారయందు స్నానముసేయ నేగితిమి. ఈస్నానము నిమిత్తమే యాత్రికు లక్కడ కేతెంతురు. ఈజలపాతము మేము విడిసిన మఠమునకు రెండుమూడు ఫర్లాంగులకంటె నెక్కువదూరము లేదు. ఆ గ్రామవాసులెల్లరును దినదిన మాజలపాతము కడనే స్నానముచేయుదురు. హరిభి యనెడు జలధార యొకకొండపై నుండి యహర్నిశలు క్రిందపడుచుండును. అచ్చటినుండియే పడమటి కనుమ లారంభమైనవని చెప్పవచ్చును. ఆజలధార మేము చూచునప్పటికి ఒకటిరెండు గజముల ప్రదేశమును మాత్రమే యాక్రమించి పడుచుండెను. కాని గ్రీష్మఋతువులో నాజలధార చాలవెడల్పు నాక్రమించి భయముగొల్పునట్లు భూమిపై పడుచుండునట. ఆజలధార పడునంత ప్రదేశమును నునుపుగానుండెను. గాని తక్కిన పర్వతభాగమంతయు పచ్చని లతాద్రుమాదులచేతను కుసుమ కోరకములచేతను మనోజ్ఞమై యుండెను. అప్పుడే సూర్యుడుదయించుచుండెను. ఆ యుదయభానుని లేతకిరణములు లతావిద్రుమాలంకృతమగు పర్వతపంక్తులమీద బర్వ నాప్రదేశమెల్ల నపరంజికాంతు లీనుచుండెను. ఆకొండలపైనుండి దొరలిదొరలి దూకుచున్న