Jump to content

పుట:Sarada Lekhalu 2.pdf/3

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీమతి తెలికిచర్ల వసుంధరాదేవి, యం.ఎ.బి.యస్.సి (లండకో)

గారి యభిప్రాయము.

శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మగారి శారద లేఖల సంపుటమును జూచితిని. సంతోషముతో జదివితిని. స్త్రీల కందఱకును బోధపడునట్లు సరళ శైలిని, మన ఆచార వ్యవహారముల గురించియు, తీర్థయాత్రల గురించియు, నవీన స్త్రీయుజ్యమముల గురించియు వ్రాసి స్త్రీలోకమున కీ మె యొనర్చిన యుపకార మెంతయు కొనియాడదగినది. భర్తృసేవానిరతలై, సంసార బంధముల త్రెంపుగొన నశక్తలై, తమ పతిసుతుల శ్రేయోభివృద్ధికై యెల్ల ప్పుడు నింట నేయుండి, దేశ పరిస్థితులు తెలియగోరెడి స్త్రీల కీ శారద లేఖలు చాల యుపయోగపడుననుటకు సందియము లేదు.

వరలక్ష్మమ్మ గారు ఒక లేఖలో “నా జీవము ధర్మము, నా మతము నీతి, నా లక్ష్యము సతీ శ్రేయము” అని వ్రాసియుండిరి. ఈ మూడింటిని తమ లేఖలయందు సమర్థించినందుల కామెను నేనభినందించుచున్నాను. ఇదేరీతిని చాలకాల మా మెకలము ప్రవహించుచుండవలెనని నాకోరిక.

స్త్రీలపాలిటి కామ ధేనువో యను గృహలక్ష్మీ పత్రికను ప్రకటించుచు డా|| కేసరిగా రిదివరకే స్త్రీలకృతజ్ఞతకు పాత్రులైరి. ఇప్పుడు స్త్రీల కెంతయో యుపయోగకరమగు శారదా లేఖల ప్రత్యేక సంపుటముగా ముద్రింపించుటయేకాక, దానిని వరలక్ష్మమ్మ గారికి బహుమతి చేసి ఆమెను గౌరవించుట శ్రీ కేసరిగారు స్త్రీలోకమునంతను గౌరవించినట్లు భావించవలసియున్నది. సతీమణుల శ్రేయోభివృద్ధికై పాటు పడుచున్న శ్రీ కేసరి గారును, ఆయనకోరికల సంతృప్తిగ నేరవేర్చుచున్న గృహలక్ష్మీ పత్రికయు, శుక్లపక్ష చంద్రునిబోలె దినదినాభివృద్ధి గాంచవలెనని నా ప్రార్థన.

క్వీజ్ మేరీకళాశాల, తెలికిచర్ల వసుంధర.

8-3-34