పుట:Saptamaidvardu-Charitramu.pdf/91

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

78

సప్తమై డ్వర్డుచరిత్రము


అమెరికా సంయుక్త రాష్ట్ర జనులు ఇంగ్లండు రాజ్యమునకు నెడయఁ డగు ప్రభువు తమ దేశముఁ జూడ రాఁబోవు చున్నాఁడని యతని గౌరవింప ననేకభం గుల నుద్యమములు సేసిరి. కన్నడా రాజ్యము నంతయు నెడ్వెర్డు గ్రుమ్మరి యందలిజనుల యూచార వ్యవహారములను, వారసుఖదుఃఖములను, వారి వృతులను, వారి పూర్వుల చరిత్రములను, మొద లగువానిని గ్రహించి, ఈ రాజ్యమున హామిట్ట ననుపురంబున 1860 సం. న సెప్టెంబరు నెల 21 న తేది రాత్రి నివసించి, మరుసటియుదయాన లేచి దేవున 'కెరఁగి, అల్పాహామును భుజించి, సబంధుమిత్ర పరివారుండై సంయుక్త రాష్ట్రపు మాగాణు లలో జేరిన డెట్రా యి టనుపురి బ్రవేశించెను.

డెట్రాయిట్టు పురపౌరులు ఇంగ్లండు రాణిపుత్రు డేతెంచెనని వీదుల సలంక రించిరి. . పచ్చనితోరణంబులు గట్టి వీధుల తుద జడాలులు వ్రేలాడ వై చిరి. రేల నన్ని చోటుల దీపములు వెలిగించిరి. రేయిం బగలు ఒక తీరుగ గాంపించెను. ఎడ్వర్డు ఎక్కిన బండి 'వీదుల నేగు నపుడు దారికి నడ్డముగ బ్రజలు బలసి యాతని విలోకింప గుంపులు గూడి నిలిచియుడిరి. "మేడ లపై వెలందులు తమలో ఇంగ్లండు నేలికక ఇతడే " అని గుసగుసలు వో వుచుండిరి. నాడాపట్టణము మునుపటి జార్జి వాసిన్గ్టన్ పునర్జీవితుఁ డై వచ్చిసభంగి గంపట్టెను.

ఎడ్వర్లు డెట్రాయిట్టు ను వదలి చికాగోకు వెళ్లెను. అప్పు