పుట:Saptamaidvardu-Charitramu.pdf/85

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

72

సప్త మైడ్వర్లు చరిత్రము.


నెలయంతమువకు కదలమెదల నేరక ఇంటిపట్టున నుండెను. ఆ సంవత్సరాంతము వరకును ఏ చోటికి వెళ్లక ఉండిరి.

ఎడ్వర్డు భార్యాసమేతుడై , అయిర్లండునకు వెళ్లెను. అచ్చట బ్రజలు తమరాజ భక్తి పెక్కు తెరంగుల గనఁబరచుచు, వారిని మిక్కిలి గౌరవించిరి. ఎడ్వర్డాలంకలో నొక తావుననే ఉండలేదు.ఆ రాజ్యమున దొడ్డవారు ఆయసను బిలిచి విందులు సేసిరి. అతఁ డొకచోట నాగలసి యుండెను; వేరొక స్థలమున ప్రజ లోసంగు నాతిద్యమును గొనవలసి యుం డెను; ఇంకొక తావున బుస్తక భండాగారంబులను , సర్వకళాశాలలను, పాఠశాలలను, బరీక్షింప పవలసి యుండెను. జనులుతమ కొఱతల నివారింపుడని వేడిన వేడికోలునకు సహేతుక ము లైన ప్రత్యుత్తరము లియ్యవలసి యుం డెను. అతఁడీ రీతులుదనయిల్లాలితో అయిర్లండున నుండి, తన దేశమునకు విచ్చేయునపుడుత్తర వేల్సుభూమికి వెళ్లెను. అచ్చట జను లారాజు దంపతులం గాంచి హర్ంబు నొంది, వారికి నాతిద్యం బొసంగిరి. ఎడ్వర్డు ఆజనుల మిక్కిలి సంతోష పరచి భార్య వెంటరా నింటికీ గ్రమ్మర నేతెంచెను.

1868 సంవత్సము జూలై నెల 6 వ తేదీని అలెగ్జాండ్రాచూలా లై యుండి, రెండవకూతు బ్రిన్సన్ విక్టోరియానుగనెను. కొన్ని నెలల వరకు రాజదంపతు లిగ్లండున నుండి యావల నైరోపాఖండ మంతయు: దిరగి వెళ్లిరి . వారు తొలు