పుట:Saptamaidvardu-Charitramu.pdf/80

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ యద్యాయము

67


గనెను. విక్టోయామనోరథము సంపూర్తిమాయెను. వెంటనే బాలెంత రాలును, బిడ్డడును, మారల్బరో మందిరబున బ్రవేశించి, అరోగ్యవంతు లై వర్ధిల్లు చుండిరి.

డెన్మార్కు. రాజు తన తనయ మగ బొట్టెను , గనెనని విని మిక్కిలి సంతోషించి బీదలఁ బెక్కు తెరంగుల నాదరించి వారికి నన్న వస్త్రదానంబులు సేసెను. విక్టోరియా కూడ తనకు మను ముఁడు జన్మించెనని మిగుల నానందంబు నొంది బీదలకు దర్మంబుల నాచరించెను. “క్లారెన్సు ప్రభువు" (Duke of Clarence)ఫుట్టినపుడు ను ఆలెగ్జాండ్రకు దాదాపు వయస్సు ఇగువదేళ్లు. ఆమెయు అత్తవారిమాడ్కి చిన్న వయస్సున * బిడ్డను గనిపెంచుటలో మిక్కిలియోర్పుకల దై రాచకార్యంబుల సంత గబాటింపక కొడుకు సుఖంబే తస సుఖంబని తలంచి యుండెను.,

డెన్మార్కు... రాజ్యమునకును, ప్రష్యా రాజ్యమునకును, గొప్పపోరు నడిచెను. ఆనామధేయుఁ డేవడో ఒకడు డెన్మార్కురాజు రణరంగంబునం బరాభవంబు నొందె నని అలెగ్జాం డ్రతో మందలించెను.ఆమె కన్నీరు మున్నీరై పాఱ దుఖింప సాగెను. ఎడ్వర్డు తన రాణియు మ్మలికంబు పాప నుద్యమించి, ఆసమాచార మెంతనఱకు నిజమై ఉండనోపు నో అని విచారింపసాగెను. ఇంతలో నొకానొకడు డెన్నార్కు- ప్రభువు గెలిచె ననుమాటను అలెగ్జాండ్రా చెవిని బడ వేసెను. ఆమె తనమనో వ్యథను తొలగఁ జేసికొని, వికశితకమల వదన యయ్యె,