పుట:Saptamaidvardu-Charitramu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

66

సప్త మైడ్వర్డు చరిత్రము.

ఇంగ్లండులో "ఆక్సుపోర్డు" అనుపట్టణము కలదు. అది సర్వకళాశాలలకుం బేరు వడిసి యుండును. అందుననేకశాస్త్రములు పెక్కుదేశములయందుండి వచ్చినవిద్యార్థులు నేర్చుకొను చుండెడివారు. అచ్చటకళాశాలాధిపతులు ఎడ్వర్డలెగ్జాండ్రులను ఆహ్వాసము చేసిరి. ఆరాజదంపతులు సపరివారులై ఆక్సుపోర్డునకు వెళ్లిరి. ఆచోట నుండివిద్వాంసులు వారిని బహుబంగుల గౌరవించి 'డాక్టరు ఆఫ్ సివిల్ లా" (Doctor of Civil law) అనుబిరుదు నెడ్వర్డునకు నొసంగిరి. ఆరాజదంపతు లాతావు వాసి తమపొందుపట్లకు నేతెంచిరి.

ఎడ్వర్డు తనగృహణితో మారల్బరో భవనంబున నివసింపసాగెను. ఆతడు తనయింటికి జనుదెంచు డొడ్డవారికి నప్పుడప్పు డు విందులు సేయు చుండెను. అలెగ్జాండ్రా తనభర్తతో నత్యుల్లాసంబునఁ గాలము గడుపు చుండ నాతరుణీమణి కాలక్రమమున గర్భమును ధరించెను. అత్తగారైనవిక్టోరియా తన కోడలి తోలిచూలున మగబిడ్డ పుట్టుఁ గాక అని కోరుచుండెను. ఇంతలో నాయలెగ్జాండ్రా సుదతీమణికి నవమాసములు నిండె.

1865 సం. న జనవరినెలలో నొకనాఁటి సాయింత్రంబునఁ బూర్ణగర్భిణి యైన అలెగ్జాండ్రా వింజరునగరునకుఁ జెంగట వర్జీనియానీటిపై బడవలో సికారి చేయు చుండెను. అప్పడఁతుక సాయంసమయంబున నాపడవలో ఒక మగసిసువును