పుట:Saptamaidvardu-Charitramu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

అయిదవ యద్యాయము

65


అతఁడు భార్యామణి తోడ నాయా తాపులకు వెళ్లి వార లిచ్చు నాతిద్యంబులు గోని యింటికిఁ జేరు చుండెను.

రాయల్ అకాడమి" (The Royal Academy) అను విద్యాలయాధిపతులు తాము చేసెడి విందుఁ గుడువ రమ్మని ఎడ్వర్డును బిలిచిరి . అతఁడు పరివార సమేతుఁడై వారియాల యమునకు వెళ్లి వారలు తనకుఁ జేసి మర్యాదలకు సంతుష్ట హృదయుం డై వారి యెడఁ దనకుఁ గలయను రాగాంబును, దేట బఱుచుచు సమంజసంబు లైన కొన్ని మాటలు ప్రసంగించి యందఱభిమానంబుల నాకర్షించుకొనెను. అప్పు డాతఁడు. పెద్దలుయెడ భ క్తియును, చిన్నల యెడ బ్రీతి విశ్వాసములును, గనఁబరచుచు నందరుకును హితమతియై ప్రవర్తించె సని “రాయల్ అకాడమి” ఆధిపతి యైన సర్ చార్లస్ ఈస్ట్ లేక్ అను నాతని భార్య వచించి యున్నది.


ఎడ్వర్డు ఆంగ్లేయ భాషా యోషాభిమానుండై పండితకవుల నాదరించుచు నుండువాడు ఆయకాడమి మందిరంబున * తాకరి ? " (Thackery) అనుపండిత కవీశ్వరుడు కూడ ప్రసంగింగిం చెను. అతఁ డావల: గొలదినములంకె స్వర్గస్థుడయ్యె. ఎడ్వర్డాపండిత సింహుని మరణము తన రాజ్యమునకు గొప్పనష్ట మనియును, ఆకవి విద్వాంసు లై యుండి బీదరికముచే శ్రమపడు కవీశ్వరులకు సన్ని విధాలఁ దోడుషడు చుండెడి వాడని యును,తాకరి మేలిగొనంబుల నుతించి పలికెను.