పుట:Saptamaidvardu-Charitramu.pdf/75

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

32

సప్త 'మైడ్వర్లు చరిత్రము.


గెను. గుడి నుండినజనులు మాటలాడక మౌనమును ధరించినవా రై ఎడ్వర్డు నలెగ్జాండ్రాను గాంచు చుండిరి. అలెగ్జాండ్రా లజ్జావనతవదన యై మతగురువు నెదుటఁ జని నిలిచెను. ఎడ్వర్డు ఆమె యోర నిలఁబడెను. మతగురువు లేచితనహ స్తంబును వధూవరులళిరస్సు పై నిడి కొన్ని మంత్రంబులు పఠియించి,ఎడ్వర్డును, అలెగ్జాండ్రను, గొన్ని ప్రశ్నల నడిగెను. ఎడ్వర్లు స్పష్టముగఁ " జేయుదును.” అని వాక్రుచ్చెను. ఆయంగనయుఁజిరులునగవు మోము నెలఁ గులుకు లాడ సన్నపు టెలుంగునఁబల్కెను. ఆమెమాటలు దాపున నుండినవారికిఁ గూడవినంబడ లేదు. డెన్మార్కురాజు తనతనయను ఇంగ్లండు ప్రభువు కొరకుఇచ్చెను. ఎడ్వర్డారాణి పాణీకమలమును గేలం గీలు కొల్పెను.పెండ్లి కూతును కుమారుడును, సభా సభ్యుల యెదుట నిలుచుటకుఁ బూర్వము ఉన్న తాసనంబు నలంకరించిన విక్టోరియాపాద కమలంబులకుఁ బ్రణమిల్లి .. "చిరంజీవులై జనుల నాయనంతరము చల్లగఁ బ్రోతురుగాక” అని ఆ రాజగృహిణి ఆశీర్వదించెను. ఆవల నా రాజదంపతులు సభ్యులచాయఁ దిరిగి,వారికి నతు లోసర్చిరి. వారును కరతాళధ్వనులు చెలంగ నాశీర్వదించిరి,

అలెగ్జాడ్రా తల్లియును, సోదరీసోదర జనంబులునుతమతోడఁ బుట్టినది. తమ్ము నెడఁ బాసి చనుచుండె నని శోకపూరితనయను లై కనుపట్టిరి. డెనార్కు- ప్రభువు ధీరుఁ డయ్యును