పుట:Saptamaidvardu-Charitramu.pdf/73

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

60

సప్తమైడ్వెర్డుచరిత్రము.


వల్లవంబన బెట్టెను. ఆమె దానిని గొని ఎడ్వర్డు పాణి గ్రహణము సేయ మిక్కిలి తమకంబున నుండె ఎడ్వర్డు నమ స్తరీతుల నలంక రించుకొని, అలెగ్జాండ్రా పాణి కమలంబు చేబట్ట నువ్విళ్లూరు చుండెను. ఆయన పినతండ్రి సాక్సుగోబర్గు గోతాప్రభువును, ప్రష్యా రాజ్యాధి పతి పెద్దకు మారుఁడను, అతని వెంటఁ జనుటకు నియమితులై యుండిరి. అతడును సమస్తరాజ చిహ్నములు ధరించి, జగములనుండు పూబోడుల వలపించ నభినవమన్మద ములక యోయను రీతి నెప్పారుచుండెను.

పెక్కు మంది సెయింటుజార్జిచే పలునకు: బయన మై ముందు నుంచి జనంబులు రాజమార్గంబులం దిరు కెలంకుల గిక్కిరిసి యుండిరి. ఆనేకులు మేడల పై నిలిచి వధూవరుల వీక్షింప గౌతుహలాయ చిత్తులై యుండిరి, జనులనేకులు తాపు చిక్క దని సెయింటు జార్జి చేపలును బండం ద్రోయుదురో అను భయము జనించుభంగిని గుంపులు గూడి దాని జుట్టు ముట్టి యుండిరి. ఆగుడిలోనికి; బోనర్హులైనవారు ముందు నేగి వారివారికి నమర్చిన యుచితాసనంబుల నధి ష్టించిరి.

రాణీ జలకంబు లాడి మంచి యుడుపులను దరియించి దేవాలయమునకు నేఁగ నుద్యుక్తురాలై యుండెను. నష్టభర్తృక యగుటచే నాయమ యందఱ వెంట. బో నొల్లక మున్ముం