పుట:Saptamaidvardu-Charitramu.pdf/72

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలవ ఆద్యాయము

59


మందిర ద్వారమునఁ బుత్ర పుత్రి కాపరివృత యగు విక్టోరియామహాచక్రవర్తిని తన కోడలగు నలెగ్జాండ్రా నెదుర్కొని వింజరు మందిరాభ్యంతర ప్రదేశమునకుఁ దోడ్కొని వెళ్లెను.

పెండ్లిమూరుతము మిక్కిలి సమీపించెను. రాణీకి గావలసిన చుట్టాలందఱును విచ్చేసి వారి వారి విడుదులలో విడిసి యుండిరి. ప్రిన్సు ఆల్బర్టు వైపున గలబందుగులును ఏ తెంచి తమ తమ బసలలో వసియించి యుండిరి. సమస్త దేశాధిపతులాయా స్థానంబుల యందుండిరి. వారందఱును ముహూర్తదినంబున వధూవరుల వెంబడిఁ జనుదేర సర్వవిధంబుల నలంకరించు కొని కట్టాయితంబై యుండిరి. రాణీ రాజ్యముల యందలి సేనానాయకు లశ్వారూడు లై ఆయుధములఁ గేలం గోని 'రాజమార్గముల యందు పారా లిచ్చు చుండిరి.

డెన్మార్కు పృథ్వీతనయ అలెగ్జాండ్రాకుఁ జెలికత్తియలు పరిమలోపేతంబగు నుష్ణోదకంబున స్నాసబు గావించి, సర్వవిధంబుల నలంకరించిరి. ఒక చేడియ నాయమకు భూషణంబుల నందించెను. ఇంకొకతె వాని నామె మేనిపైఁ దొడంగెను. వేరొక్కతె ఆతరుణీ మణి నీలాలకములు చిక్కు. దీసి పూలు దురిమి ముడిచెను. వెండియు నొక్క ఆకాంతాలలామంబునకు దివ్యపట్టు వస్త్రంబులు కట్టఁ బెట్టెను. ఒండొక్కతె నానావిధము లైనపూలు కట్టిన పూబంతి నా యలెగ్జాండ్రా “ పాణి