పుట:Saptamaidvardu-Charitramu.pdf/70

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాలప అద్యాయము.

57


డెన్మార్కు నుండి లండనుపురికీ నే తెంచు చుండిన పెండ్లి వారినావ థేమ్సునదీ ముఖ ద్వారముఁ జేరెనను సమాచారము ఎడ్వర్లు ప్రభృతులకు నందెను. పిరంగులు “అలెగ్జాండ్రా రా వమ్మా! 'రావమ్మా మాపురికి" అని పిలుచుచుండె నను లాగున మ్రోగెను. బాండు వాద్య ధ్వనులు నింగి ముట్టె. లండను పురి "వా స్తవ్యుల కరతాళధ్వనులు జనుల చెవులు దూట్లు చేయుచుం డెను. ఇంతలో బెండ్లి వారు లండను నగరమును డాయం జను దెంచిరి. ఎడ్వర్డు ప్రభృతు లుండిన నాననుండి చిన్న పడవ నదిలోనికి.డిగి, అలెగ్జాండ్రాను బిలుచుకొని వచ్చుటకు నాయమ నావను సమీపించెను. పెళ్లి వారిలో ముఖ్యులు అందుదిగి ఎశ్వర్ణుండిన తావు సేరిరి.

ఓడకడుపున నుండిన ఎడ్వర్డు ఓడ పై ప్రదేశమునకు నే తెంచెను. అలెగ్జాండ్రా ఆయనను డాయం బోయెను. అతఁడా రాచపూఁబోడి కెం గేలును తన కేలుకో, గీలుకొలిపి ముద్దిడు కొనెను. అందఱు గొల్లున నవ్విరి. అనేకులు కరతాళ ధ్వనులు నింగి ముట్టం జెలంగఁ జేసిరి. మంత్రి ప్రభృతులు ఎడ్వర్ణ లెగ్జాండ్రాలిద్ద ఱికి మీద నన్యోన్యాను రాగంబునఁ బ్రవర్తించురని నిశ్చయించిరి,

రాణి ప్రధానులును, మతగురువులును, లండను నగరవా స్తవ్యులును, పరరాజ్య ప్రభు సమూహములును, సామంత రాజ ప్రకరం బులును, ఆయుధ పాణు లైన సేనానిచయంబులును,