పుట:Saptamaidvardu-Charitramu.pdf/54

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

మూడవ అధ్యాయము

41


ఎడ్వర్లు "కేం బ్రిడ్జులోఁ జలి కాలమంతయును నుండెను. చలికాలపు రజారోజులు వచ్చెను. పాఠశాలలు మూసిరి, రాణి మున్నగువా రెడ్వర్లు "కూర్రా” అను చోట ధనుర్విద్యా పారంగ తుఁడు కావలె ననికోరి, ఆరజా దినములలో నచ్చటికి బంపిరి.ఎడ్వర్డు అచ్చోటికి వెళ్లి సేనానాయకుఁడైనకర్నల్ పెర్సీవానివలన రణశాస్త్రమర్మంబుల నేర్చుకొని యందుఁ బ్రవీణుడయ్యె.

మూఁడవ అధ్యాయము.


ఎడ్వర్డుతండ్రి మరణము.

ఎడ్వర్డు కేంబ్రిడ్జు కళా శాలయందు విద్యాభ్యాసము సేయు చుండెను. అతఁడాచోటఁ దనయుపాధ్యాయుల యజ్ఞలకు విధేయుఁ డై సహ పాఠకుల నందుఱకుఁ బ్రియుండై యుం డెను. అతడు చదువును ముగించి, అయిరోపా ఖండంబున నుండు డెన్మార్కు- రాజ్యమునకు నోడయనిపట్టి నలెగ్జాండ్రాను యువతీమణిని జూడవలయు నని అతనితండ్రి తలంచి, వారిద్దఱును జర్మనిలో సంధింపవలయు నని కోనెను. ఈ రహస్యము ఎక్వర్డు తండ్రికి హృదయ పేటికాంతర్గతమై యుండెను. కాని అయిరోపాఖండ మందలి వార్తాపత్రిక లారహస్యమును వెల్లడి పఱచెను. అంత సంగ్లండులోని పత్రికలు, ఈ మర్మమును కొంతవఱకు