పుట:Saptamaidvardu-Charitramu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ అధ్యాయము

39


మును, తత్సంబంధము లైన పారి శ్రామిక వృత్తులును, డాక్టర్ నలియాన్ ప్లే ఫేర్ (Dr. Lyon Play fair.) అను నాతనివలన నేర్చి, సామానులు సేయుచోటికిఁ దనయు సాధ్యాయుని వెంట వెళ్లి, వానిఁ జేయుమార్గములను దెలిసికోనెను. జర్మనీ దేశస్థుఁడును, ఎడింబరున హైస్కూలునకు డైరెక్టరును, అయిన డాక్టర్ షమిట్టు: (Dr. Schmitz.) అనునాతఁడు ఎడ్వర్డునుకు రోముపుచరిత్రమును దెల్చెను. ఎడ్వర్డు తనకుఁ దీరుపాటోదపినపుడు వారమునకు మూడుతడవల ఎడింబరుస నుండు ధనుర్విద్యాలయమున నావిద్యను చింతన చేయు చుండెడివాడు. మిగత కాలమున నాతడు ఇటలి జర్మని ప్రాన్సు మున్నగుదేశ భాషలు నేర్చుకొను చుండెను. ఎడ్వడ్లునకు న్యాయశాస్త్రమును (Law) దేశచత్రమును (History.) నేర్చుటకు ఫేష(Fisher) రను నాతఁడు కుదురుకొనెను. ఎడ్వర్డు ఏ వేళ నీ శాస్త్రములన వలనభ్యసించు చుండినను, కొంచెము తీరుబాటు కలుగ జేసికొని సర్ వా ట్టరుస్కాట్సు వ్రాసిన నవలలను, జర్మని ఫ్రెంచి భాషలతో వ్రాసినవవలలను, వెర్రి యెత్తిన వానికై నడీఁ జదువు చుండెడి వాడు. ఎడ్వర్డు ఎడింబరు జదువును పూర్తిగ సభ్యసించి, 'పండుగలకు నింటికి వచ్చెను.

ఎడ్వర్డు విద్య యింకను ముగియ లేదు. అతను ఆక్సుఫోర్డు(Oxford)సర్వకళాశాలలోఁ జదుప నుద్యమించెను. అతని తల్లిదండ్రు లాతని నచ్చటికిఁ బనుపసిద్దు లై యుండిరి. అతఁ