పుట:Saptamaidvardu-Charitramu.pdf/50

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ అధ్యాయము.

37


ములతోఁ జెక్కిన చంద్రహారమును కానుకగా నిచ్చెను. అతని బావ యాతనియప్పను వెంట నిడుకొని తన దేశమునకు నేగెను. ఎడ్వర్డు తనయప్పను విడిచి పెట్టి యుండుటకుఁ గొంత-చింతించి, ఆవలఁ దనహృదయము నూఱట పడుచుకొని యుండె ..

ఎడ్వర్డు వయస్సు పదునేడేండ్లుండెను. అతఁడు సకలశాస్త్రంబుల నేర్చుకొనుటకు నాతనిబు ద్ధిబలము తగినస్థితిలో నుండెను. ఆతఁ డింతదనుక ఇంటిలో నుపాధ్యాయుల నియ మించుకోని వారినలన నానావిధవిద్యల నేర్చుకొను చుండెను. ఇంక మీద నటుల కాదు.. అతఁడు సామాన్యులమాడ్కి ఆక్సుపోర్టు కేంబ్రిడ్జు, ఎడింరుకు మున్నగ సర్వకళాశాలలలోను, అయిరో పాఖండుబున నుండుక ళాశాలలయందును, ధనుర్విద్య యందును, వ్యాపారతంత్రంబులలోను, సమ స్తవస్తుజాలంబులఁ చేయుటలోను నేర్పఱి తనము పొరయవలె నని, ఆతనితల్లి దంద్రులు కోరి ఆతనితో గూడ చదుకొనుటకు ముగ్గురు సహపారులను నియమించి, రిచ్ మంమండ్. ఉద్యానవనంబున నుండు నైట్ లాడ్జ్ అనుసస్త్ర శాలయందు ధనుర్విద్యను నేర్చుకోను నటుకల నేర్పాటులు సేసిరి. ఎడ్వర్ణుధన్వుద్యను నేర్చుకొను సప్పుడు తనయుసాధ్యాయుల యాజ్ఞల నతిక్రమింషక సామాన్య బాలుని భంగి పర్తించి రణశాస్త్ర మర్మంబుల నన్నింటిని నేర్చుకొనెను. అతఁ డావిద్యలో బరిపూర్ణ ప్రజ్ఞానంతుఁ డై యొరులకుఁ దా నావిద్యను నేర్పునంతజ్ఞానమును సంపాదించి వీరవరుఁ డయ్యె.