పుట:Saptamaidvardu-Charitramu.pdf/5

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

4

తే. శ్రీచతుర్భుజదాసుండు శ్రీలఁ బెంచి
    కలిమిఁ దనకుద్దిలేఁ డని పలుక జనులు
    బీదసాదల హరిప్రీతి నాదరించి
    కీర్తి కౌముది వెలయంగఁ గృష్ణుఁ జేరె. 5

క. వానికి నిర్వురు తనయులు
   మానధనుల్ పాపభీత మానసులు ధరన్
   సూనృతవాక్య ధురీణలు
   కానక జన్మించి రధిక గౌరవ మెసగన్ . 6

క. గిరిధరగోవిందాహ్వయు
   లరుదార విభూతి మెఱయ సంచితవిద్యల్
   కరమర్థి నేర్చి పెద్దలఁ
   బరితృప్తులఁ జేతు రిలను భవ్యశ్రీలన్. 7

తే. గీ. అన్నగిరిధరు ననిశంబు నధికప్రీతి
        జానకీరాము లక్ష్మణస్వామి గొల్చు
        భంగి సేవించి శ్రీకృష్ణుపాదకమల
        మధువుఁ గ్రోలుగోవిందుఁడు మహితభక్తి. 8

తే. గీ. ఆంధ్రభాషావధూటి ననారతంబు
        గౌరవించుట కెదఁ గోరిఁ గవుల బుధుల
        నాదరించుచు బీదల మోద మెసఁగఁ
        మనుచు గోవిందుఁ బ్రోచెడి మాధవుండు. 9