పుట:Saptamaidvardu-Charitramu.pdf/49

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

సస్త మైడ్వేర్డు చరిత్రము


ఎడ్వర్డు తన యిల్లు - ఫ్రాన్సుజర్మని మొద లగుతావులకు విద్యార్థియై వెళ్లెను.అతని సంట జనరల్ గ్రే అనునాతండును, గృహస్థధర్మముల నేర్చునట్టి హెచ్ పోన్ సన్ " బియును, శాస్త్రముల నేర్పుగిబ్సను, మున్నగువారు సనిరి. కొన్నిసమయములలో దేశములలో నందందు చిత్రవిచిత్రము లగు ధాతులతాదులఁ గాంచు నిమిత్త మాతఁడు కాలినడకను బోవు చుండెను. అడేవేళ ల నేయేచోటుల నేయేరీతుల నుడువలయునో అయా వేళల నాయాతాపుల నాయావిదంబుల నుండెను. అతఁడు తాను రాచబిడ్డఁ డనియును, తా నెచ్చో టికి నేఁగినను, రాజునకుఁ జేయఁ దగినగౌరవములు సేయవలయు నని కోరిన వాఁడు కాడు. అతని సామాన్యజనుని పగిది దస యు సౌధ్యాయుల వెంట నాయాతావులయంచుఁ గ్రుమ్మరి ఇల్లుచేరెను.

ఎడ్వర్డు విద్యాభ్యాసము

ఎడ్వర్డు నప్ప ప్రిన్సస్ రాయల్ అను చిన్నది వ్యక్తురాలయ్యె. ఆమెకుఁ బదు. నేండ్లు నిండెను. ప్రష్యాచక్రవర్తి ఫ్రెడరిక్కు విల్లియ మనురాకోమారుఁ డాతరుణిని 'జేపట్టగోరెను. రాణి తనకుమార్తెకు మంచివరుడు లభిచె సని కౌతూహలచిత్త యై మంత్రులతో నాలోచించి మిగులవైభ వంబుస నాచిన్న దాని నాయుర్వీశ్వరునకు నిచ్చి సెంటు జేమ్సు చేపలున వివాహము సేసెను. ఎడ్వర్డు తన యక్కకు సవరత్న