పుట:Saptamaidvardu-Charitramu.pdf/38

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ అధ్యాయము.

27


'రాజదంపతు లాలోచించి, వారు చెప్పిన పద్ధతులఁ దమతనయునకు సకలవిద్యలను నేర్ప సమర్థుఁ డగుపండితుని హేన్రిబెర్చి అను నుపాధ్యాయుని నియమించిరి. అతఁడు నీతికోవిదుఁడు అతఁడు ఎడ్వర్డునకు సకల శాస్త్రంబుల నేర్ప సమర్థుఁడు.. ఎడ్వర్ణాయుపాధ్యాయుని వలనఁ జదువు నేర్వ నారంభిం చెను.రాణీయు:ను ఆయమహృదయేశుంకును ప్రధానులునుమున్నగు దొడ్డనారు ఎడ్వర్డు చిత్తరువులు వ్రాయుటను, గానకళను, అస్త్రవిద్యను, ఈవిద్య ఆవిద్య అని లేక సమస్త విద్య లను నేర్చుకొన వలయునని శాసించిరి. అన్ని విద్యలలో నిపుణుడు లభించుట దుర్లభము. బీర్చు ఆంగ్లేయ భాషా ప్రవీణుఁడు.ఆతనికి నితరశాస్త్రము లంతగఁ తెలియవు, ఆతఁడు ఎడ్వర్డునకు నేవేళ నంగలవిద్య నేర్పు చుండినను, అప్పుడప్పుడు నాతనికి వాచక ధాటియును, చిత్తరువు వ్రాయుట, మొద లగు విద్యల నేర్పుటకు ఆ విద్యలయందుఁ బ్రవీణు లైన పండితులను మంత్రులు నియమించిరి. వారు రాకొమకునకు నియమిత కాలములందుఁ దాము నేర్చిన విద్యలను నేర్చు చుండిరి. రాణి తన ముద్దు కొమారుఁడు క్రైస్తనమత స్వభావము నెఱుంగక ఉపేక్షించు నేమో అని ఆది వారములయందు నాబాలునకు క్రైస్తవమత గ్రంథంబుల నేర్పు చుండెను. ఎడ్వర్డు ఏయే కాలంబుల ఏయేగ్రంథంబుల నీర్చి చింతన చేయవలయునో ఆయా కాలంబులనొజ్జలు నింయమించుపాఠంబుల ననుదినంబునను తప్పక భయ