పుట:Saptamaidvardu-Charitramu.pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26సస్త మైడ్వర్డు చరిత్రము.



చెంచి, యింటఁ గొన్ని రోజు లుండెను. అతని తల్లిదండ్రులుతమబిడ్డల నెచ్చటికీ బంపక, తమకడ నే ఉంచుకొని, వారిని గాంచి, తత్సుఖము కొంచుచుండిరి.

1847 సం. న ఆగస్టు నెలలో శ్రీ విక్టోరియా రాణిభర్తృస మేత యై "పెద్దకొడుకును, "పెద్దకూతును వెంట నిడుకొని స్కాంట్లండు దేశమునకు వెళ్లెను. ఎడ్వర్డురాక స్కాచు జనులకు నానందదాయకమై యుండెను. వారాతని జూడఁగోరుచుండిరి. రాణియును, ఆదే వేరి ప్రాణసఖుఁడును, బిడ్డలను, మిల్ 'ఫోర్డు హావక్ "రేవునఁ జేరఁగనే, అచ్చటి జనులు పెక్కుమంది ఎడ్వర్డును వీక్షింప గుంపులు గూడి వచ్చిరి. రాణి తనకోడుకులను వారికిఁ జూ పెను. అచ్చటనుండి ఇంగ్లండు నేలిక శిశు వుల తోడను ప్రాణేశు తోడను స్కాట్లండు పశ్చిమ ప్రదేశమంతయుఁ గ్రుమ్మరి యచ్చట వినోద బులం జూచి ప్రమోదభరిత చిత్తయై తనయింటికిఁ జను నెంచెను. 1848 -సం.. న రాణివేరొక యాడ శిశువును గ నెను. దానికి ప్రిన్సులూయి అను పేరు.

ఎడ్వర్డు విద్యను నేర్ప ప్రారంబించుట,

ఎడ్వర్డునకు నైదేండ్లు నిం డెను. అతని తల్లీతండ్రులుబాలునకుఁ జదువు నేర్ప వలయు నని నిష్కర్ష చేసిరి.. కాని ఎట్టివిద్య నా బాలునకు గ'ఱ పవలయునో వారికి తె లియక కొంత కాలము వారు తహతహపడు చుండిరి. ఇంతలో బారన్ స్టాకుమరును, ఆక్సుఫోర్లు బిషపును, జేమ్సు క్లార్కును. వీరలతో వా