పుట:Saptamaidvardu-Charitramu.pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ అధ్యాయము.

25


మంది "రాణీ యాస్థానమంటపంబునకు వచ్చి వారి వారి విద్యలనురాణికిని, ఆయమబిడ్డలకును, కనఁబతిచి, వారినానం దాబ్ధిని నోలలాడించి, వారివలన బహువిధ భూషణంబులఁ బొంది తమ తమ పొందుపట్లకు నేఁగు చుండిరి. ఉన్నట్టుండి యాయేఁట రుస్యా చక్రవ ర్తి నికల్ హా సనునాతఁడు లండనుపురికి నే తెం చెను. శ్రీ రాణీయును మంత్రులును ఆయనను బహుభంగుల గౌ'రం చిరి. ఆ పుడమిదోరయును 'రాణి నిసువులఁ గాంచి, వారి నెత్తుకొని, ముద్దాడి, అచ్చట గొన్ని దినము లుండి పిదపఁ దన రాజ్యంమునకు మఱ లెను. 1844సం. న ఆగస్టు నెలలో శ్రీమహా రాణి రెండవకొమరుఁ గనెను. జనులు రాణికి నాల్గుమంది బిడ్డలుదైవకృపాకటాక్షంబునఁ బుట్టి వర్ధిల్లుచుండి రని ప్రమోదభరిత చిత్తులై , కాయును భక్తయును ఆ పుట్టిన రాకొమురునకు " ఆల్బర్టు అర్నెస్టు" అని పేరు పెట్టిరి. ఆబిడ్డఁడును దినదిన ప్రవర్ధమానుఁ డగుచుండెను. రాణియును ఆయమహృదయేశ్వరుఁడును బిడ్డలును కొన్ని దినములు లండనుసగరమునను, వింజరుమందిరంబునను, మఱి కొన్ని రోజులు ఆస్బోర నను అంత్ః పురము నను మొద లగుచోటుల విశ్రాంతి జెందుచు నుండిరి , 1846 సం. న శ్రీమహా రాణి మఱొక యాఁడు శిశువును గనెను. దాని పేరు హెలీ. అవల సెడ్వర్డు తన తల్లిదండ్రులతో బడవలోఁ గారన్ వాలునకు నే గెను. అచ్చట ప్రజలు వానిని జూచి సంతసించి, రాణివెంట నతఁడు తిరిగి తనవీటికీ నరు.