పుట:Saptamaidvardu-Charitramu.pdf/30

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండ ప అధ్యాయము,

19


టికి వచ్చినయతిథులకు స్వాగతం బొసంగి, వారిని పలు తెఱంగుల గారవించి, ఆ భూధవులలో జర్మనిచక్రవర్తి పరమ ముఖ్యుడు. ఆయన రాణి కుమారునకు నామకరణము సేయ నియమితుఁడై యుండె.

1842 సంవత్సరము జనవరి నెల 25వ తేదీని లండనున గరనరము సౌభాగ్య గరిమ నెంతని వర్ణింప నగు ? నాఁ డెచ్చటంజూచినను జను లనేకులు గూడి " నేడు రాణి వుత్రునకు నామకరణమట. రాజులును, రాణులును, రాజబంధువులునుప్రధానులును మున్నగువారు మిగుల వైభనంబున నశ్వంబుల బూన్చీన శకటంబుల పై లండనుపుర వీథుల నూ రేగుదురట! అతిమనోజ్ఞ మైనచూపు. ఆహా ! నేఁడుగదా మనము నోచిన నోము లన్నియు సఫలము లగుట " అని గుజగుజులు సల్పు చుండిరి, లండనుపురి వీదులతిరమణీయంబుగ నలంకృతం బై యుండె , నానావిధము లైనపచ్చతోరణములు రాజద్వారంబులం గట్టబడెను. పౌరులు తా మనేక రీతుల సింగారించుకొని మేడలపై రాజపరివారమును జూడ నిలుచుండిరి. వీధులకు నిరువైపుల ననేకులు నిలిచి యుండిరి.మికొందఱు ప్రాకారంబుల నెక్కి వానిమీఁదఁ గూర్చుండిరి. ఇంకఁ గొందఱు వృక్ష శాభాగంబుల నొక్కి, వారందఱుబాలరాజ వదసమును జూడ మిక్కిలికోరినవారైరి. 'రాజాంతఃపురము చాయ నే దృష్టి సారించి చూచు చుండిరి.