పుట:Saptamaidvardu-Charitramu.pdf/29

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

18

సస్త మైడ్వర్డు చరిత్రము,


గవలసి యుండెను.అతని తల్లితండ్రులును, ప్రధానవర్గంబులును, కాంటెబర్బెరీ ఆర్చిబిషప్ మున్నగుమతాచార్యులును, మొద లగు గొప్పవారు చేరి జనవరి నెల 25వ తేదీ మంగ ళవారమున ఎడ్వర్డునకు జ్ఞానస్నానము జరుగ వలయు నని నిశ్చయించిరి. వా రామహోత్సవము వేడుకను మిగుల వైభవమున నొనర్పవలయు నని కోరిక. రాణిగారును, ఆయమ ప్రాంణ మిత్రుఁ డగునాల్బర్టు దొరగారును, ఎడ్వర్డునకు జ్ఞానస్నానమునునామక రణమును, ముందు రాచబిడ్డలకు రాజుంతః పురమందిరంబున జరుగునటుల గాక సర్వసాధారణముగ నండఱ బిడ్డలకును జ్ఞానస్నానము నడుచువిధంబున దేవాలయంబున నడుపవలసిన దని తీర్పు నేసి, తమతీర్చును మంత్రులకు నెఱుక పజిచిరి . .వారును 'కాంటెర్బెరి ఆర్చిబిషపు నాలోచించి రాణిగారిమాట యుక్తియు క్రిముగ నున్న దని యెంచి యాదేవి మనో భీష్ట ప్రకారము వర్తించి నిశ్చయించుకొనిరి.

రాణీగారు అమ హోత్సవమును జూచుటకు రమ్మని అయిరోపా లోని దొరలకు పలుజాబులు వ్రాయించెను. ఇంగ్లండునందలి జనులు దమరాణీ ముద్దు శ్శువునకు నామక కణము జరుగు నని కౌతూహులు శ్రీ బాల రాజబింబమును దరింపు నువ్విల్లూరు. చుండిరి. వి.దేశములనుండి. భూపాలకు లనేకు లింగండ్లునకు విచ్చేసిరి. "వారివారి పదవులకుఁ దగిన రీతిని విడిదిలమరి యుండెను. రాణిగారును ఆయమభర్తయును తమయిం