పుట:Saptamaidvardu-Charitramu.pdf/28

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ అధ్యాయము.

17


ఆరోగ్యవంతు లగుచుండిరి.

ఎడ్వర్డు " ప్రిన్స్ ఆఫ్ వేల్సు " అనుబిరుదు నొందుట.లండనుపురము జన బాహుళ్యము చే సనారోగ్యకర మైనదని వైద్యులు సెప్పినందున శ్రీ విక్టోరియాయును, భర్తయగు నాల్బర్టు ప్రభువును, తమ బిడ్డలను వెంట నిడుకొని మిక్కిలి యారోగ్యప్రదేశ మైనవింజరునగరున నివసింప 1841 సం. న డిసంబరు నెల 6 వ తేదీన 'వెళ్లిరి. అచ్చటఁ దల్లియును, శిశుపులును, క్రమముగ నారోగ్యవంతులైరి. ఆతావునకు "నే తించిన రెండవదినమున ననేక సామంతప్రభు పలయెదుట, శ్రీవిక్టోరియా మ హారాన్ని తన సీమంతపుత్రునకు "ప్రిన్స్ ఆఫ్ వేల్సు" అను బిరుదు నొసంగే. మొదటి ఎడ్వర్డు ఇంగ్లండును పాలించెను. అతడు " వేల్సు" అను రాజ్యభాగమును జయించి, తనరాజ్యములో దానిఁ జేర్చుకొని, ఇంగ్లండు ఱేనికిఁబుట్టు పెద్దకుమారుఁడు " వేల్సు కాజ్యభాగముగకు యువ రాజు , " అయి యుండునని శాశించెను. ఆయన చట్ట ప్రకార మప్పటినుంచి యిప్పటివఱకు నా యువరాజు పదము ఇంగ్లండు రాజు జ్యేష్టపుత్రునకు లభించు చున్నది. ఇప్పుడు సదేవిధమున నెడ్వర్డు 1841 సం. నడిశెం బరు నెల 8 వ తేదీని,వేల్సు రాజ్యభాగ ముసకు యౌవ రాజ్య పట్ట భద్రుఁడయ్యె.

శ్రీ యెడ్వర్డునకు జ్ఞానస్నానము జరుగుట,

1842 సంవత్సరమున ఎడ్వర్డునకు జ్ఞానస్నా సము జరు