పుట:Saptamaidvardu-Charitramu.pdf/25

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

14

సప్తమై డ్వర్డు చరిత్రము


యమునఁ బొరయునాపదనుండి శ్రీరాణిని గా పాడి యాదేవి కడుపున నొక పుత్రుడు పుట్టునటుల దయచేసి న మ్మిక నేలు ఱేనిని మాకునందఁ జేసితివి. ఇంతవఱకు నాదేవిని రక్షించిన భంగి సింక పై నారాణిని గా పాడుచు నని మేము నిన్నుఁ బ్రార్థిం చుచున్నాము. ఆదే వేళకి బలము లేని వేళ మంచిసత్తువ నోసంగి సౌఖ్య 'మొదవఁ జేయుము. ఇప్పుడు మారాచబిడ్డనియత్మకు గాని శరీరమునకుఁగాని కీడుపొరయకుండునటులఁ గాపాడుము. అబాలుఁడు పెరుఁగను బెరుఁగను సుజ్ఞానము పొదలఁ జేయుము, ఈ ప్రాట స్టెంటును తాచారములను, మా దేశస్థులను, ప్రపంచ మును, గాసాడునీవు నీమేలిగొనములు గలవానిఁగ నారాచ బిడ్డని నొనర్పుము. మిక్కిలి ప్రేమతో మారాణిని, ఆయమ కాంతుఁ డగునాల్బర్టు ప్రభువును, ప్రాపంచిక సౌఖ్యముల నన్ని టిని నిరంతరాయముగ ననుభవించు నటుల దయ చేసి, నిష్క శంక మైనదియును, అచలమైనదియును, అయిన కీర్తి కాముడిని వారిద్దఱు పొందునటుల సనుగ్రహింపుము. నీ హృదయమునం దలి కరుణామృతము, నీ ప్రజలచి తంబునఁ బ్రవహింపఁ జే యుము; ఏవేళ విడువక నీయాజ్ఞలను నిర్వర్తింపఁ జేయు టకును, మే మందఱమును సోదరభావముతం మెలఁగు టకును, మా రాజును నిండు ప్రేముడిని గౌరవించుటకును,మాకు ననుజ్ఞ నిమ్ము. నీ పేరుల మాకు దయచేసి కలుగఁ జేసిన నీ యాజ్ఞలను నీ యెడ భయభక్తులతో శిరసావహించి చేయ,