Jump to content

పుట:Saptamaidvardu-Charitramu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రెండవ అధ్యాయము

11


న్నగువారు క్రిక్కిఱిసి గుంపులు చేరి యుండిరి. రాణీకి పురుష శిశుపు పుట్టగానే, డాక్టరు లా కాకు సర్ జేస్సు క్లార్కుతో నామేలిమాట 'నెరుక పఱచెను. అతఁడు మంత్రులకు నా శుభ వార్త తెలియఁ జేసెను. వా రందజు నానం దాబ్దిని మునిఁగిరి దాది రాణిగారి తల్లికి నాశిశువును జూపెను. ఆపల నామంత్ర సానిబిడ్డను దన కేలను గొని ప్రిన్సు ఆల్బర్టు ననుజ్ఞను గైకొని యచ్చట గుమి కూడిన గొప్ప వారండఱకు నా బిడ్డను జూపెను. అందురు ఆ రాచబిడ్డను గాంచి తమకుఁ బ్రభువు పుట్టెగదా యని మనంబున సంతోషించిరి.


మంత్రు లింతలో నాశుభ వార్తను లండనుపురి గలయ జల్లిరి. ఆయుధ శాలలయందలి పెరంగులు ఇంగ్లండునకు నోడయఁడు పుట్టె నని తెల్పెను. గుడులలో వ్రేలాడుగంటలుమ్రోగె. కోటల పై బతాకలు, తల 'లెత్తియాడసాగెను. బకింగుహాము భసనము చుట్టు ననేకులు గుంపులుగూడి రాణికి మగశిశువు పుట్టెనని పలుకు నుండిరి. వేయేల? నాఁ పురవరంబున “ఓసీ అక్క ! మనకాణి చిన్న మగశిసువును గన్నందటే? పోయి చూతము రారమ్ము.” అనునారీమణులును, "ఓయి! "నేడు మనతో గూడి యాడుటకు రాణికి ఒక పురుష శిశువు పుట్టినాడట! వానితో మసము గోలీలు బొంగరములు బాగుగ నాడుకోనవచ్చునోయి ? అబిడ్డను చూచి వత్తము. రండి." అని పలికికొను బాలకులును, “ఎన్నాళ్ల కెన్నాళ్లకు