పుట:Saptamaidvardu-Charitramu.pdf/18

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

మొదటి అధ్యాయము.

7

పదిసంవత్సరములుమాత్రము రాష్ట్రమును బాలించెను. అతని కాలమున నీటియావిరిబలమున నావలును, రైలు బండ్లును నడవఁ దొడంగెను. అతనికి బిడ్డలు లేరు. అతనితమ్ముఁడు నాలవ విల్లియము ఇంగ్లండునకు 1830 సం. న అధిపతి యాయెను. అతఁడు ఏడేండ్లు రాజ్య మేలెను. అతని దొరతనమున బానిస వర్తకము తుదముట్టెను. అతనికి కొడుకులుగాని కొమార్తలు గాని లేనందున అతని తమ్మునికొమార్త యగుశ్రీవిక్టోరియా మహారాజ్ఞి పదునెనిమిదియవ యేఁట రాజ్యమునకు వచ్చెను.

రెండవ అధ్యాయము.

ఎడ్వర్డు పుట్టుక

శ్రీ విక్టోరియా మహారాజ్ఞి కెంటురాజ్యముయొక్క ప్రభువునకు జన్మించె. ఈ కెంటుభూస్వామి భార్యయును, శ్రీ విక్టోరియారాణికిఁ దల్లియును అయినసాధ్వికి సాక్సుకోబర్గు గోతా (Saxe Coburg Gotha) అను రాజ్యమునకు నొడయఁడు సమానోదరుఁడు, అతని రెండవకుమారుఁడు, ప్రిన్సు ఆల్బర్టను నాతఁడు తనకు మేనయత్తకోమార్త యగువిక్టోరియా మహారాణిని వివాహ మాడెను. విక్టోరియా తన మేనమామ కుమారుని వరియించి పెండ్లి చేసికొనె ననిభావము. ఇంగ్లం