పుట:Saptamaidvardu-Charitramu.pdf/174

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదునొకండవ ప్రకరణము

177


పఱచి, సమ స్తరాజచిహ్నములతో నారాజశవమును సమాధి చేయించిరి.


విక్టోరియా కాలధర్మము సెందినప్పుడు జనులు ముసలి డొరసాని పోయె నని చింతింపక ఉండిరి. ఎడ్వర్డు తల్లి మాడ్కి- బెక్లేండ్లు రాజ్యము నేల లేదు. అందరును ఆలెగ్జాండ్రా వైధవ్యదశను బొందవలసి వచ్చెఁగదా అని కుందు చుండిరి. “" అయ్యో! పాపము! అలెగ్జాండ్రా నలువ డేండ్లు మగని దగ్గఱ గాపురము సేసినది. ఎన్నడైన నాయన మనస్సు 'మెచ్చు లాగున "నాయిల్లాలు వర్తించి యుండు నే? ఆగృహిణి పోయి, ఎడ్వర్డుండకూడదా? " అని పెక్కుమంది పల్కు. చుండిరి. ఎశ్వర్డు, ప్రభుత్వమునకు వచ్చి తొమ్మిది సంవత్సరములు రాజ్యము 'నేలెను. అతని ప్రభుత్వ మారంభంబున నాయా చోటులలో గలహము లుద్భవిల్లినను, అవన్నియు క్షీణించి, అన్ని చోటుల జనులు సుఖంబుగ నుండఁ జూలిరి. హిందూ దేశ స్థులు విక్టోరియా పరిపాలనలో సుఖంబుగ మనిరి. ఎడ్వర్డు దొర తనమున వారియుల్లంబుల నవశక్తి నెలకొనెను. అది భగవం తుని కృపచే సభివృద్ధి బొందులాగున నాయెడ్వర్డు హిందూ దేశ స్థులకు "లేనిహక్కుల గల్పించి అల్లరుల నాంపి, దేశమును నెమ్మది స్థితిని జార్జికి నప్పగించి తాను దీర్ఘ కాలము విశ్రాంతి జెంద వెళ్లె.