పుట:Saptamaidvardu-Charitramu.pdf/173

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

176

సప్తు మైడ్వర్డు చరిత్రము


బర్వెను. ఎడ్వర్డు స్వర్గమునకు వేగు చున్నాఁ డని చాటించు రీతిని నుద్యాన వనంబుల నుండు పక్షి గణంబులు కిలకల మని కూయఁదొడగెను. మూలల దాఁగిన చీకటులు సన్న సన్నగ రాజొచ్చేను. చోరులును, విటులును, సంతసంబున సందుగొం దుల విహరింపసాగిరి. చుక్కలు మిన్నున మినుకుమినుకని రా జిల్లగడంగెను. లండను పుర వాసు లన్నము తినియుఁ దినక ఎడ్వర్డు దేహస్థితి సరయుటకు బకింగు హాముభవనంబును సమీపించి గుమి గూడి యుండిరి.

బకింగుహాములోపల నెడ్వర్డుమోమువన్నె డస్సె. నోట మాట నిలిచె; కన్నులు మూతవడె; ఊపిరివిడుచుట మానె; దంతముల కాంతి డీలువడె ; దేహావయవము లన్నియుఁ జల్ల నయ్యే; మే నెల 7 వ తేది శుక్రవారము నాటి రేయి నడిజా మున నెడ్వర్లు మృతి నోందె; నని ఆయన చెంగట నుండు నలెగ్జాండ్రా, ఆతని పెద్దకోమారుఁడు జార్జి, మున్నగు వారు తెలిసికొని గొల్లున నేడువ సాగిరి. కాంటెర్బరీ ఆర్చిబిషపు, ఎడ్వర్డు సమీపంబున నుండి రాజు నాత్మ యేసు నాభుని యను మతిని బొంది స్వర్గముఁ జేర భగవంతుని స్తోత్రము సేయు చుండెను. "వెస్టుమినిస్టరు కోవెల గంట, ఎడ్వర్డు నాకంబునకు నేగె, నని జనులకు దెల్పుచుండె. నను తెలుంగున శబ్దంచెను. ఇంతలో నెడ్వర్డు మంత్రు లేతెంచి తండ్రి చావున కై వగచు చుండు జార్జి నూజడించి, అలెగ్జాడ్రా దుఃఖమును శాంత