పుట:Saptamaidvardu-Charitramu.pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పదియవయ ధ్యాయము.

157


వారు దానిని క్షమించిరి. పిమ్మట నెడ్వర్డు తనయిరవునకు నరు దెంచెను.

ఎడ్వర్డు లండనుపురికిఁ జనుదెంచినతోడ్తోన నేకులు ఆయ నను జూడ వచ్చిరి. ఆయన వారి నందఱను గౌరవించెను. ఆయన పెద్దకూతును, ఆయమబిడ్డలును, ఇంకన నేక పర రాజు నికరంబులును, అతనిఁ జూడ నేతెంచి యుండిరి. ఎడ్వర్డు రోగ ముచే నెంత మాత్రము ప్రాలుమాలక తాను సేయవలసిన కార్యం బుల నెల్ల మంత్రుల యధీనంబున విడువక వానిఁ దానే చేయుచు, వచ్చిన ప్రభువుల సంభావించుచు నుండెను.

ఎడ్వర్డు సాండ్రింగుహాము భవనంబునకు వెళ్లెను. అతఁ డీచోట ననేక కాలంబుల నుండి ప్రొద్దుఁ గడుపు చుం డెడివాడు. అభవనమునకు నలుగడల నాయనభూము లుండును. ఆతఁ డా భూముల వ్యససాయము సేయుటకుఁ గాపులకు విడుచు చుండును. అతడాచోట నుండునపుడు వారి సౌఖ్యములకు నావంతయేనియు భంగము లేకుండ నుపాయంబుల వెదకి వారికి నెల్లసుఖంబు గలుగఁ జేయు చుండెడివాడు.. అతఁడు వారికి నిండ్లను గట్టించి యిచ్చెను. వారికిఁ గృషికి వలయు పరి కరము గొని యిచ్చెను. అతను సేద్యమునకు పలయు సౌ ఖ్యంబుల నన్నంటిని వారికిఁ గూర్చి వారి నెనరు వడయుటకుఁ బాత్రుడయ్యె.