156
సప్త మైడ్వర్డు చరిత్రము.
బియారిట్జనుతావునకుఁ బంపిరి. ఎడ్వర్డు ఎప్పటి రీతిని వ్యాధి లేని వానిపగిది నుదయము సాయంకాలుబుల సికారి పోవుచు, వారి వారికి వ్రాసిన జూబులఁ జదివి నానికి దస్కతు చేయుచు, తన్ను జూడ నేతెంచిన వారిని గౌరవించుచు, విడుమరదినముల యందును రాచపనులఁ గావించుచు, మిత్రులతో నరససల్లాప ములు సేయుచు, నియమిత కాలంబుల భగవదారాధనల నొన ర్చుచు, రోగ మని శయ్య పై బరుండుక సర్వదా ఏదో ఒక పని సేయు చుండువాడు.
ఎడ్వర్డు తనపురికి విచ్చేయు త్రోవలోఁ బారిస్సు నగరం బుస బడిపిల్ల కాయలకు విందు నడిచెను. ఎడ్వర్డా చోటికి వెళ్లిన కాలంబున నాతనికి ఒక దొడ్డవాడు వ్రాసినకమ్మ జారి క్రింద బడెను. కాని అతఁడు దాని గమనింప లేదు. ఆవల నాతఁడు దానిపోకను గని దానిఁ గైకొన్న వారి నారయు చుండెను బడి పిల్లలకు నధిపతులలో నొకతె తనకు నాజాబు దొరికినదనియుఁ, దాను దానిని విప్పి చదివితి ననియు, వచించెను. అంత దాని యధి కారులు గొప్ప రాజు నుత్తరము నాయనయనుమతి లేక చదివి నందులకు నాగ్రహచిత్తు లై దానిఁ బనినుండి "తొలగింపు నుద్యమించు చుండిరి. ఈ వార్త ఎడ్వర్డు చెవినిఁ బడెను. వెంట నే అతఁ జాబడి విచారాణాధ్యక్షులకు " ఆ ముసలిది తెలియక అజ్ఞానము చే నాజాబుఁ దీసికొనినందుల కై దానిని జీవనాధారము నుండి తొలగింపకుఁడు. ఇదియ నామనవి." అని వ్రాయగా,