పుట:Saptamaidvardu-Charitramu.pdf/167

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

154

సప్త మైడ్వర్డు చరిత్రము.


1910 సం. న పచ్చు వచ్చుబడి సెలవుల లెక్క తయారు సేయవలయునని ఎడ్వర్డుమంత్రులు పార్లమెంటులో జర్చించిరి. ఎడ్వర్డు కోరికకు విరోధముగ నా లెక్కల పట్టి తయారగు నటులఁ గన్పట్టెను. అందుచే ఎడ్వర్లు వారికి విరోధముగఁ బ్రవ ర్తింప వలసియుండెను. కాని ముత్రులలో నేక్కువవారు ఎడ్వ ర్డుపక్షమున నుండి ఎడ్వర్డు కోరిక ప్రకారమున నాపట్టిని తయారు చేయించిరి.

1910 సం. వ ఫ్రిబవరి నెలలో నెడ్వడ్లు పార్లమెంటు సభ లను దెరచెను. అతఁడు మార్చి నెలాఖకురు వఱకు నూపిరి విడు చుటకుఁ గూడ విడమర లేక రాచ కార్యములు నిర్వంచు చుండెను. బీదల కష్టముల సంత మొందఁ జేయుటకు యొకసభ యేర్పడి యుండెను. ఆసభా సభ్యులు బీదల కై మిక్కి-లీ కష్ట పడిరి, ఎడ్వర్డు వారిని బహుబంగులఁ బ్రశంసించెను,


మార్చి నెల 5 వ తేదిని ఎడ్వర్డు కడపటతడవ గొలువు తీరెను. మంత్రులును, పార్ల మెంటు సభాసభ్యులును, వెండియు ననేక రాజులును, కొలువు కూటంబున నాయా తావులలో సమరి యుండిరి. ఎడ్వర్డు 'రాజకీయ వ్యవహారంబుల విచా రించి నాఁటి సాయంకాలంబున సందరకు విందు నెనర్చెను. అప్పు డ నేకులు వచ్చి సంప్రీతిమై నావిందుఁ గుడిచి తమతమ పొందుపట్లకు నేగిరి. మఱునాఁ డాది వారము. నాడు ఎడ్వర్డు, ప్రభువు భగ